ఎప్పుడు ఏం జరుగుతందో ఎవరూహించలేరు.. ఊహలకందనివే వాస్తవాలు.. మనతో అప్పటివరకూ నవ్వుతూ మాట్లాడిన మనషి కూడా మన కళ్ళముందే నమ్మలేని విధంగా మరణించవచ్చు.. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది.. అప్పటివరకు తనతోపాటు డ్యూటీ చేస్తూ బాత్రుమ్ కు అని వెళ్లిన పైలట్ ఉన్నటుండి మృతి చేదారు..
ఆదివారం రాత్రి ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళ్తున్న లాటామ్ ఎయిర్ లైన్స్ విమానం టేక్ ఆఫ్ అయిన మూడు గంటల తర్వాత ఆ విమానం నడుపుతున్న పైలట్ అస్వస్థ కి గురయ్యారు.. తదనంతరం భాత్ రూమ్ కి వెళ్లి వస్తానని కో పైలెట్ కి చెప్పి వెళ్ళాడు.. అయితే భాత్ రూమ్ కి వెళ్లిన పైలెట్ ఎంతకి తిరిగి రాలేదు.. దీనితో అనుమానం వచ్చిన కో పైలెట్ భాత్ రూమ్ కి వెళ్లి చూడగా కుప్పకూలిపోయి ఉన్నాడు..
విమానంలో సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించారు.. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అయితే పైలట్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన కో పైలట్ టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జె్న్సీ ల్యాండింగ్ చేశాడు. వెంటనే పైలట్ ఇవాన్ ను వైద్య బృందం పరిశీలించగా.. అప్పటికీ అతను చనిపోయినట్లు గుర్తించారు..విమానంలో సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించారు.. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.
అయితే ఆ విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.. ప్రయాణికులను ఓ హోటల్ లో ఉంచి వసతి కల్పించిన అధికారులు.. మంగళవారం తిరిగి విమాన కార్యకలాపాలను ప్రారంభించారు.
మరోవైపు ఈ విషాద ఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని తెలిపింది. ఓ గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని ఎయిర్ లైన్స్ పేర్కొంది. మరోవైపు కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. పైలట్ ను కాపాండేందుకు తాము ఎంతో ప్రయత్నించామని.. అయినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని ఎయిర్ లైన్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.