భారతీయ-అమెరికన్ చట్టసభ్యురాలికి జాతివివక్ష బెదిరింపులు

0
90

అమెరికాలో భారతీయులపై విద్వేష దాడులు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు భారతీయులపై దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికాలో కీలక స్థానంలో చట్టసభ్యురాలిగా ఉన్న ప్రమీలా జయపాల్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. భారత-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు అయిన ప్రమీలా జయపాల్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి దుర్భాషలాడారు. విద్వేషపూరిత సందేశాలు పంపాడు. వీటిని ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని సదరు వ్యక్తి ప్రమీలా జయపాల్ ను బెదిరించాడు.

సాధారణంగా రాజకీయ నాయకులు తమ బలహీనతలను చూపించరు. అయితే హింసను అంగీకరించలేమని.. అందుకే ఈ వీటని పోస్టు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. హింసను ప్రోత్సహించే జాత్యంకార, లింగ వివక్షను మేము సహించలేమని.. ప్రమీలా జయపాల్ ట్వీట్ చేశారు. గతంలో ఓ సారి సియాటెల్ లోని ఆమె ఇంటి ముందు ఓ వ్యక్తి పిస్టోల్ తో కనిపించాడు. ఆ తరువాత అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నైలో జన్మించిన ప్రమీలా జయపాల్ అమెరికాలో మొట్టమొదటి భారత సంతతి చట్టసభ్యురాలు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)కు సియాటెల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయులు జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. సెప్టెంబర్ 1న, కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి భారతీయ-అమెరికన్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు.. అతన్ని ‘డర్టీ హిందువు’ అంటూ..అసహ్యకరమైన కుక్క అంటూ దుర్భాషలాడారు. అంతకుముందు ఆగస్టు 26న టెక్సాస్ లో నలుగురు భారతీయ మహిళపై ఓ మెక్సికో అమెరికన్ మహిళ దాడి చేసింది. ‘ఎఫ్’ అనే పదాన్ని ఉపయోగిస్తు మహిళలపై దాడి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here