ఇండియాకు వెళ్లిపోండి.. అక్కడ బాగుంటే ఇక్కడకు ఎందుకు వచ్చారు.. భారతీయులపై జాత్యంహకార దాడి

0
141

నాకు భారతీయులు అంటే ఇష్టం లేదు.. ఇక్కడకు ఎందుకు వచ్చారు.. అమెరికాలో ఎక్కడా చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.. భారత్ లో బాగుంటే ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఓ అమెరికన్ మహిళ భారతీయులపై దాడి చేస్తూ జాత్యహంకార దాడికి పాల్పడింది. నలుగురు భారతీయ-అమెకన్లపై ఓ మహిళ జాతిపరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ-అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఓ మహిళ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసింది. భారత్ కు తిరిగి వెళ్లండి అంటూ దుర్భాషలాడింది.

టెక్సాస్ డల్లాస్ నగరంలో పార్కింగ్ స్థలంలో నలుగురు ఇండియన్ మహిళలు మాట్లాడుతుండగా..అక్కడికి వచ్చిన మహిళ వారిపై దాడి చేస్తూ పలు జాత్యంహకార వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను ప్లానోకు చెందిన మెక్సికన్- అమెరికన్ ఎస్మెరాల్డా అప్టన్‌గా గుర్తించారు. ‘‘ నేరు మిమ్మల్ని భారతీయులను ద్వేషిస్తున్నాను.. ఈ భారతీయులు మెరగైన జీవితాన్ని కోరుకుంటారు కాబట్టి అమెరికాకు వచ్చారు’’ అంటూ ‘ఎఫ్’ పదాన్ని చాలా సార్లు వాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో యూఎస్ లోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో వైరల్ అయింది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ఈ సంఘటన గురించి వివరించారు. మా అమ్మ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళ్లిందని.. ఆ సమయంలో మెక్సికన్-అమెరికన్ అక్కడిక వచ్చి వారితో వాదించిందని.. అయితే వారు జాతి దూషణలు చేయవద్దని అభ్యర్థించారని తెలిపాడు. తాను యునైటెడ్ స్టేట్స్ లో పుట్టానని చెబుతూ.. సదరు అమెరికన్ భారతీయులపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒకనొక సమయంలో భారతీయులు నేను ఎక్కడిక వెళ్లినా కనిపిస్తున్నారని.. ఇండియాలో జీవితం చాలా గొప్పగా ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ అరుస్తూ మెక్సికన్-అమెరికన్ మహిళ హంగామా చేసింది. సదరు మహిళపై దాడి, తీవ్రవాద బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here