ప్లీజ్ సాయం చేయండి.. హర్దిక్ పాండ్యా, షాహీద్ ఆఫ్రిదిని కోరిన రషీద్ ఖాన్

0
160

ఆఫ్ఘనిస్తాన్ భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. జూన్ 21న, 6.1 తీవ్రతతో వచ్చిన వచ్చిన భూకంపం పేద దేశం ఆప్ఘనిస్తాన్ ను మరింతగా నష్టపరిచింది. దాదాపుగా ఇప్పటి వరకు 1000కి పైగా మంది మరణించారు. అక్కడి పరిస్థితులు చాలా దయనీయంగా మారాయి. భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడటంతో పాటు.. మట్టి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇంకా చాలా మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. భూకంపంతో సంక్షోభంలో ఉన్న ఆప్ఘాన్ కు ప్రపంచ దేశాలు చేయూత అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. అక్కడి తాలిబన్ ప్రభుత్వం కూడా అంతర్జాతీయ సహాయాన్ని కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే ఆప్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ భూకంప బాధితులకు సహాయం చేయాలని కోరుతున్నారు. భూకంపం సంభవించిన తర్వాత తన కుటుంబాన్ని కోల్పోయిన ఓ చిన్నారి ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రషీద్ ఖాన్. తన దేశం కోసం సహాయం కోరాడు. “ఈ లిటిల్ ఏంజెల్ ఆమె కుటుంబంలో మిగిలిన ఏకైక సభ్యుడు, స్థానికులు ఆమె కుటుంబంలోని ఇతర సభ్యులను కనుగొనలేకపోయారు. కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి మరియు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు మరియు బయట ప్రాంతాలలో. ప్టీజ్ విరాళం ఇవ్వండి.” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా, వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదిని సహాయం చేయాల్సిందిగా కోరాడు. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ శక్తివంతంగా తయారవుతుందని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here