Removing Condom Without Partner Consent Is Crime: 2017లో ఓ జంట ఆన్లైన్లో పరిచయం అయ్యింది. ఇష్టాలు కలవడంతో, డేటింగ్ చేశారు. ఆ తర్వాత శృంగారంలో పాల్గొనడానికి కూడా రెడీ అయ్యారు. అయితే, ఇక్కడే అమ్మాయి ఓ మెలిక పెట్టింది. కండోమ్ ధరిస్తేనే శృంగానికి సై అని, లేకపోతే నై అని తేల్చి చెప్పింది. అందుకు ఆ అబ్బాయి ఓకే అన్నాడు. కానీ, శృంగారం చేస్తున్న సమయంలో మధ్యలోనే తీసేశాడు. అది ఆ అమ్మాయి గమనించలేదు.
అయితే.. కొన్ని రోజుల తర్వాత తనకు ఆ అమ్మాయికి ఆ విషయం తెలిసింది. దాంతో ఆ అమ్మాయికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. కండోమ్ లేకుండా రొమాన్స్‌లో పాల్గొన్నారు కాబట్టి, హెచ్ఐవీ వంటి రోగాలేమైనా వస్తాయేమోనన్న భయంతో ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత అతడ్ని కోర్టుకు ఈడ్చింది. తనకు ఇష్టం లేకున్నా, కండోమ్ తీసేసి శృంగారం చేయడంతో లైంగిక వేధింపుల కేసు వేసింది. మొదట్లో ఈ కేసుని ట్రయల్ కోర్టు కొట్టేయడంతో, సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన అత్యున్నత న్యాయ స్థానం.. సంచలన తీర్పు ఇచ్చింది.
ఇష్టపూర్వకంగా పార్ట్నర్స్ శృంగారంలో పాల్గొన్నా.. పార్ట్నర్కి తెలియకుండా కండోమ్ తొలగిస్తే మాత్రం అత్యాచార నేరంగానే పరిగణిస్తామని కోర్టు తీర్పునిచ్చింది. కండోమ్ లేకుండా చేసే శృంగారం, కండోమ్‌తో పాల్గొనే శృంగారం.. రెండూ విభిన్నమైనవని కోర్టు ఖరారు చేసింది. కండోమ్ విషయంలోనూ ఇరువురి సమ్మతి అవసరమేనంటూ కోర్టు తేల్చింది. ఈ విషయంలో కిర్క్‌పాట్రిక్ ‘ట్రయల్’ను ఎదుర్కోవలసి ఉంటుందని కోర్టు పేర్కొంది.