viral news: RRR సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన బ్రెజిల్ ప్రెసిడెంట్

0
138

ఆత్రంగా అన్ని పనులు ఒకసారే చెయ్యాల్సిన అవసరంలేదు.. చేసే ఒక్క పనైనా పర్ఫెక్ట్ గా చేస్తే చాలు అనేలా ఉంటుంది జక్కన నైజం.. అందుకే జక్కన ఏ సినిమా తెరకెక్కించిన నిదానంగా చేస్తారు.. కానీ అవుట్ పుట్ 100% ఉంటుంది.. థియేటర్ లో బొమ్మ అదిరిపోతుంది అది దర్శకుడు రాజమౌళి స్టైల్..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగెర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన సంచలనాత్మక చిత్రం RRR (“రౌద్రం రణం రుధిరం” ).. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.. ప్రపంచస్థాయిలో ఏ భారతీయ సినిమా అందుకోని ప్రశంసలను అందుకుంది..

ఈ చిత్రంలో నటించిన హీరోలు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు.. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ చిత్రం వచ్చి దాదాపు ఏడాది పూర్తి అయినా ఇప్పటికి RRR మూవీ లోని పాటలు వినపడుతుంటాయి..అలానే చర్చించుకుంటూనే ఉన్నారు..

అంతలా ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ చిత్రం..కాగా తాజాగా బ్రెజిల్ దేశపు ప్రెసిడెంట్ ‘లూయిజ్ ఇనాకియో లులా డా సిల్వ’ ఈ చిత్రంపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..తాను RRR చిత్తాన్ని చూశానని..అందులో ఫన్, యాక్షన్ రెండూ ఉన్నాయని.. డైరెక్టర్ భారతీయ చరిత్రను అద్భుతంగా చూపించారని.. నటీ నటులు కూడా ఎంతో బాగా యాక్ట్ చేసారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.. దీనితో ఈ చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తపరిచారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here