Viral News: ఇదేం పనిరా అయ్యా.. నీ పబ్లిసిటీ మీద మన్నుబొయ్యా

0
25

ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు.. కాకపోతే అవకాశం రాక కొందరు.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో తెలియక మరి కొందరు.. ఆర్ధిక సమస్యలతో ఇంకొందరు తమలో ఉన్న ప్రతిభని నిరూపించుకోవడంలో విఫలం అయ్యారు.. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ప్రతిభను నిరూపించుకుని ప్రజల ఆద్దరాభిమానాలు సంపాదిస్తున్నారు.. ఆర్దికంగా కూడా స్థిరపడుతున్నారు.. అయితే కొందరు మాత్రం ప్రతిభ లేకపోయినా ప్రజలని ఆకర్షించేందుకు రకరకాల పిచ్చి వేషాలు వేస్తుంటారు.. కొన్ని సార్లు ఆ పిచ్చి పనులు ప్రాణంతాకమైనవి గా ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు ఇండోనేసియా లో చోటు చేసుకుంది..

పిల్లల సాధారణంగా కార్టూన్ షోలని ఇష్టపడుతుంటారు.. అలా ప్రజాధారణ పొందిన కార్టూన్ లో ఒపేయ్ ది సెయిలర్ మ్యాన్ అనే కార్టూన్ షో ఒకటి.. అందులో పొపాయ్‌ అనే క్యారెక్టర్ బచ్చలి కూర నుండి అసాధారణ శక్తిని పొందుతుంటారు.. అయితే అదే విధంగా నేను ఎందుకు అలాంటి కండలు పెంచకూడదు అనుకున్నాడు సోషల్ మీడియా లో రుకీ బజుకి అని పిలవబడే కిరిల్ తెరేషిన్ అనే వ్యక్తి.. అందుకు అతను తన చేతుల్లోకి 3 లీటర్ల పెట్రోలియం జెల్లీని ఇంజెక్ట్ చేసుకున్నాడు..

సాధారణంగ పెట్రోలియం జెల్లీ అనేది ప్రాణతకం.. ఎందుకంటే ఇది రక్త ప్రసరణ జరగకుండా ఆపుతుంది.. ఇదే విషయంని వైద్య నిపుణులు కిరిల్ తెరేషిన్ కి చెప్పారు.. ఆ పెట్రోలియం జెల్లీని మీ చేతులలోనుండి తోలించక పోతే రక్త ప్రసరణ జరగక చేతులు సచ్చుబడిపోతాయని తర్వాత చేతులని పూర్తిగా తొలిగించాల్సి వస్తుంది లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారని కిరిల్ తన సోషల్ మీడియా వేదికగా చెప్పారు..

కాబట్టి అతను జెల్లీ యొక్క పెద్ద ముద్దలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనేక విధానాలుగా ప్రయత్నాలు చేయవలసి వచ్చిందని.. నేను ప్రాణాలకి తెగించి ఎంత సాహసం చేసిన కూడా జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోవడం భాధాకరంగ ఉందని తన బాధనిసోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. కాగ తానూ భారీ చేతులతో ఉన్న ఫొటోస్ వీడియోస్ షేర్ చెయ్యగా అవి నెట్టింట వైరల్ గా మారాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here