Luna 25: రష్యా ఆత్రం.. విఫలమైన ప్రయత్నం

0
45

ప్రపంచ దేశాల ద్రుష్టి ఇప్పుడు భారత్ వైపే ఉంది.. కారణం టెక్నాలజీలో భారత్ సాధిస్తున్న పురోగాభివృధి.. మరియు భారత్ ఎవరితో పోటీ పడదు..చెయ్యాల్సిన పనిని ఆపదు.. వైఫల్యాలని లెక్క చెయ్యకుండా వైఫల్యాలే విజయానికి సూచనలు అనే ధోరణితో ముందుకు వెళ్తుంది.. పొగడ్తకి పొంగిపోదు.. విమర్శకి కృంగిపోదు.. ఆ గొప్ప వ్యక్తిత్వమే ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది.. ఈ మాట చెప్పడానికి కారణం.. రష్యా..

చంద్రాయన్-౩ని చంద్రునిపైకి పంపి చంద్రుని దక్షణ ధ్రువం పైనకి చేరుకొన్న తొలి దేశంగా ఘనత సాధించాలని భారత్ చూస్తుంది.. అయితే భారత్ ఆశకి బ్రేక్ ఇచ్చి తను మొదటగా చంద్రుని దక్షణ ధ్రువం పైకి చేరుకొని రికార్డు సృష్టించాలనుకుంది రష్యా..ఇందుకోసం లూనా25ని చంద్రుని పైకి పంపింది.. అయితే ఇది శనివారం మధ్యాహ్నం 2:57 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువం పై ల్యాండ్ కావాల్సి ఉంది లూనా25..

ఆ సమయంలో ల్యాండర్ వేగాన్ని శాస్త్రవేత్తలు తమ ఆధీనములోకి తెచ్చుకోవడంలో విఫలం అయ్యారు..దీనితో ల్యాండర్ అధిక వేగంతో చంద్రుని ఉపరితలాన్ని డీకొట్టి పేలిపోయింది.. అయితే ల్యాండింగ్ కి ముందే ల్యాండర్ తో సంభందాలు తెగిపోవడంతో ల్యాండర్ కమ్యూనికేషన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నించి సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో విఫలం అయ్యారు.. అన్నీ కమ్యూనికేషన్స్ ని అదుపులో కి తెచ్చుకుని పరిశీలించగా ల్యాండర్ పేలిపోయునట్లు రష్యా ప్రకటించింది.. భారత్ కంటే ముందే చంద్రుని దక్షణ ధ్రువం పైకి చేరుకోవాలని రష్యా ఆతృత పండిందని.. ఆ ఆత్రుత కారణంగానే లూనా విఫలం అయ్యిందనే అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి..

కానీ వాస్తవానికి లూనా 25 ప్రయోగం రష్యా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. 2021 లోనే రహ్య లూనా 25 ని చంద్రుని పైకి పంపాలనుకుంది.. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ ప్రయోగాన్ని నిలిపివేసింది.. భారత్ చంద్రయాన్ ౩ ని చంద్రుని మీదకు పంపడంతో ఇంకా ఈ ప్రయోగాన్ని ఆలస్యం చెయ్యకూదను అనుకుంది.. స్లింగ్ షాట్ పద్ధతిలో టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోలేదు రష్యా.. ఖర్చు ఎక్కువైనా సరే భారత్ కంటే ముందే లూనా 25 ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలనుకుంది.. .అయితే త్వరగా చంద్రుని పైన లూనా 25 దించాలనుకున్న రష్యాకి చేదు అనుభవమే మిగిలింది.. ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ లోకి వెళ్లడంతోనే లూనా 25కి సమస్యలు మొదలయ్యాయి.. అంతేకాకుండా చివరి నిమిషంలో ల్యాండర్ వేగాన్ని శాస్త్రవేత్తలు నియంత్రించలేకపోవడమే లూనా 25 కూలిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు..

ఇండియా, నాసా తో కలిసి ఆర్టెమిస్ ప్రయోగాలకు దిగటం దీనికి ఓ కారణంగా అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే భారత్ ప్రయోగం కంటే ముందు తాము సక్సెస్ కావాలని, తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలవాలనుకున్న రష్యా కల కలగానే మిగిలింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here