పుతిన్ ప్రకటనతో రష్యా వదులుతున్న యువత.. కారణం ఇదే.

0
118

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మరింతగా ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. పాక్షిక సైనిక సమీకరణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ వైపు మరింత మంది సైనికులను తరలించనున్నట్లు తెలుస్తోంది. తమ భూభాగాలను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని.. అణుబాంబు వేసే సమయం వచ్చిందని..దీన్ని అమెరికా, దాని మిత్ర రాజ్యాలు డ్రామాలు అనుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు రష్యా అధినేత పుతిన్.

రానున్న రోజుల్లో 3 లక్షల మంది సైన్యాన్ని ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడేందుకు పంపిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు రష్యా యువతలో భయాన్ని నింపాయి. సైనిక సమీకరణల్లో భాగంగా గతంలో మిలిటరీలో పనిచేసిన వ్యక్తులను, ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులను సమీకరించారని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 18-35 ఏళ్ల వయసులో ఉన్న యువకులను సైన్యంలో చేర్చుకోనున్నారు. అవసరాన్ని బట్టి యువతను సైన్యంలో చేరాల్సిందిగా ఆదేశించే అవకాశం కూడా ఉండొచ్చు.

అయితే పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అక్కడి యువత పక్కనే ఉన్న యూరోపియన్ దేశాలకు వెళ్లిపోతున్నారు. యూరోయిన్ దేశాలకు రష్యా నుంచి విమానాల ఎగురుతున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. యుద్ధంలో పాల్గొమని అధ్యక్షుడు ఎప్పుడైనా అడిగే అవకాశం ఉండటంతో అక్కడి ఎయిర్ లైన్స్ యువతకు టికెట్లు విక్రయించడాన్ని నిలిపివేస్తున్నట్లు రష్యన్ మీడియా నివేదించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో పాల్గొనే కన్నా దేశాన్ని వదిలిపెట్టడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here