పొడవైన మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ అరేబియా..

0
78

సౌదీ అరేబియా వినూత్నమైన మెగా సిటీని నిర్మిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ‘‘ ది లైన్’’ ప్రాజెక్టు పేరుతో నియోమ్ వద్ద 170 కిలోమీటర్ల పొడవుతో మెగా సిటీని నిర్మిస్తోంది. సౌదీలోని వాయువ్య టబుక్ ప్రావిన్సులోని ఎడారిలో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయిన వీడియో బయటకు వచ్చింది. ఏడారి ప్రాంతంలో వందలాది ట్రక్కులు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.

2017లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టును ప్రకటించింది సౌదీ అరేబియా. పలువురు ఆర్కిటెక్చర్లు, ఆర్థికవేత్తలు దీని సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ మెగాసిటీ పనులు ప్రారంభం అయ్యాయి. ఫ్లయింగ్ టాక్సీలు, రోబోట్స్ ఉపయోగం, గ్రీన్ ఎనర్జీ, ఏఐ మొదలైనవి ఈ సిటీలో ఉపయోగించనున్నారు. పూర్తిగా అద్దంతో కప్పబడిన స్కై లైన్స్ ను సమాంతరంగా 170 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. దీని వెడల్పు కేవలం 200 మీటర్లు మాత్రమే. సముద్ర మట్టానికి 500 ఎత్తులో ఈ నిర్మాణాన్ని నిర్మిస్తోంది.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. పవన, సౌర, హైడ్రోజన్ శక్తితో సహా అన్ని రకాల పునరుత్పాదక శక్తితో ఈ మెగాసిటీ నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచంలో పూర్తిగా నడిచే మొదటి నగరంగా ఇది రికార్డులకెక్కబోతోంది. ప్రకృతితో సహజీవనం చేసే విధంగా.. పూర్తిగా పునరుత్పాదక శక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సౌదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ది లైన్ ప్రాజెక్టులో రోడ్లు, కార్లు ఏం ఉండవు. ఇది 100 శాతం పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. 95 శాతం భూభాగం ప్రకృతి కోసం వినియోగించనున్నారు. సంప్రదాయ నగరాల మాదిరి కాకుండా..ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూఏఈ, సౌదీ వంటి దేశాలు మెగా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశాలు పూర్తిగా చమురుపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా.. ఏదో రోజు ఈ నిల్వలు అడుగంటి పోతాయని తెలిసే ఈ దేశాలు పర్యాటక రంగం, స్థిరాస్తి రంగాలక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ బుర్జ్ ఖలీపా, పామ్ ఐలాండ్స్ వంటి మెగా ప్రాజెక్టును తీసుకువచ్చింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here