43 ఏళ్లలో 53 సార్లు వివాహాలు.. సౌదీ అరేబియాలో ఓ వ్యక్తి రికార్డ్

0
160

ఇక వ్యక్తి ఒకసారి, మహా అయితే మూడు వివాహాలు చేసుకోవడం చూస్తుంటాం. అయితే సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 53 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 43 ఏళ్లలో 53 సార్లు వేర్వేరు యువతులను వివాహం చేసుకున్నాడని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. అయితే అతను మాత్రం వ్యక్తిగత ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదని.. వివాహబంధంలో స్థిరత్వం కోసం ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెబుతున్నారుడు. అతనికి ఓ బిరుదు కూడా ఇచ్చారు. ‘ ఈ శతాబ్ధపు బహు భార్యత్వవేత్త’ అనే బిరుదు కూడా పొందాడు.

63 ఏళ్ల అబూ అబ్దుల్లా అనే వ్యక్తి 63 ఏళ్లలో చాలా వరకు సౌదీకే చెందిన యువతులనే పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తన తొలివివాహం 20 ఏళ్ల వయసులో జరిగిందని.. తన కన్నా ఆరేళ్ల పెద్దదైన యవతిని పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం కూడా ఓ వివాహం చేసుకున్నాడు. అయితే ఇకపై తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్నాడు. తాజాగా అబ్దుల్లా స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాలను వెల్లడించాడు. మొదటి వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. భార్య, పిల్లలతో సుఖంగా ఉండటంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్పాడు. 23 ఏళ్ల వయసులో సమస్యలు రావడంతో మళ్లీ వివాహం చేసుకున్నానని.. ఈ విషయాన్ని తన భార్యకు కూడా తెలియజేశానని చెప్పాడు.

అయితే రెండో భార్యతో గొడవలు రావడంతో మూడో వివాహం.. ఆ తరువాత నాలుగో వివాహం చేసుకున్నానని.. మొదటి ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చే వివాహం చేసుకున్నానని తెలిపాడు. ఇక్కడి ట్విస్ట్ ఏంటంటే.. ఈ 53 పెళ్లిళ్లలో ఒకటి మాత్రం ఒక రాత్రితోనే పెటాకులైంది. అయితే అతని వివాహాలు చాలా వరకు సౌదీ అరేబియాకు చెందిన మహిళలతోనే జరిగాయని.. అయితే విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలను కూడా వివాహం చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here