నలుగురిలో మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.. పదిమందిలో ఉన్నప్పుడు నడవడిక జాగ్రత్త.. మన పెద్దవాళ్ళు మనకి పదేపదే చెప్పే మాటలివి.. మరి ఆ మాటలని పెడచెవిన పెడితే ఆ పైన పర్యవసానం దారుణంగా ఉంటుంది.. ముఖ్యంగా పదవిలోనో పైస్థాయైలోనో ఉన్నవాళ్లు అందరికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే సమాజం ద్రుష్టి ఎప్పుడు వారిపైనే ఉంటుంది. ఏ మాత్రం అనాలోచితంగా ప్రవర్తించిన ఇంకా ఈ సమాజం ఏకిపారేస్తది.. అలాంటి ఘటనే స్పెయిన్ లో చోటు చేసుకుంది..
ఫిఫా వుమెన్ వరల్డ్‌కప్-2023 స్పెయిన్ జట్టు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనందంతో స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ క్రీడాకారుణులకు ముద్దులు పెట్టిన విషయం తెలిసిందే. జట్టు సభ్యులకు మెడల్స్ ఇస్తున్న సమయంలో స్టార్ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసోకి లిప్‌లాక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు.
గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన అలా ప్రవర్తించడం పైన స్పెయిన్ ప్రజలతో పాటు ప్రభత్వం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఎంత పదవిలో ఉంటె మాత్రం ఇలా అనాలోచితంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తారా అని విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ విషయం పైన స్పందించిన లూయిస్ తాను చేసిన పనికి క్షమాపణలు తెలియచేసారు.. తాను తన జట్టు గెలిచిందన్న ఆనందంలో అలా చేశానని.. ఆ చర్య వెనక ఎలాంటి దురుద్దేశం లేదని.. స్పష్టం చేశారు..
కాగా ఈ క్షమాపణలు సరిపోవని తాను చేసిన ఈ అభ్యంతరకరమైన విషయంపైన ఇంకా మరింత స్పష్టత ఇవ్వాలంటూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఖెజ్ ఆరోపించారు.. అయితే ఫెడరేషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని, దాని ప్రెసిడెంట్‌ను తొలగించే అధికారం స్పెయిన్ ప్రభుత్వానికి లేదని అన్నారు. కానీ.. ఈ వ్యవహారంపై తాము ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రధాని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.. తన తప్పుకి క్షామాపణలు చెప్పిన లూయిస్ పైన విమర్శలు ఆగడంలేదు.. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలనే విమర్శలు గుప్పింస్తున్నారు అక్కడి ప్రజలు..