శ్రీలంకలో పరిస్థితి ఉద్రిక్తం.. ప్రధాని రాజీనామా చేసిన శాంతించని జనం..ఇంటికి నిప్పు

0
175

శ్రీలంకలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తాశారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పరిస్థితి చేయిదాటిపోయిందనే హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనం నుంచి పారిపోయాడు. తాజాగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కొద్ది గంటల క్రితం గోటబయ రాజపక్స రాజీనమా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడిన ఆందోళకారులు నిప్పంటించారని లంక ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇదిలా ఉంటే తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు రణిల్ విక్రమసింఘే. ఈ రోజు శ్రీలంకలోని అధికార, విపక్ష పార్టీలతో ఆయన తాజా పరిస్థితుల గురించి చర్చించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీపదేశంలో గత మార్చి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడితో గోటబయతో పాటు అప్పటి ప్రధాని మహిందా రాజపక్సలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆందోళనలకు తలొగ్గి మహిందా రాజపక్స తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో రణిల్ విక్రమ సింఘే మే 12న అధికారం చేపట్టారు. తాజాగా జరుగుతున్న ఆందోళనతో ఆయన కూడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మార్చి నుంచి శ్రీలంకలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిందా రాజపక్సను ప్రధాని పదవి నుంచి తప్పించి రణిల్ విక్రమ సింఘే అధికారం చేపట్టినా మార్పు రాలేదు. జనాలు నిత్యావసరాలు, పెట్రోల్ కోసం పడిగాపులు పడుతున్నారు. ఎక్కడ చూసిన బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో జనాల్లో తీవ్ర అసహనం పెళ్లుబికింది. శనివారం రాజధాని కొలంబోలో తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు ప్రజలు. మాజీ క్రికెటర్లు, మాజీ ఆర్మీ అధికారులు కూడా ఆందోళనలకు మద్దతు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here