శ్రీలంకలో రాజపక్స కుటుంబీకులు అధికారం ముగిసింది. శ్రీలంకను దశాబ్ధాలుగా శాసిస్తున్న రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడారు శ్రీలంక ప్రజలు. తాజాగా శనివారం ప్రారంభం అయిన ఆందోళనతో ఇక చేసేందేం లేక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధికారికి నివాసాన్ని వదిలి మాల్దీవులకు పారిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం కుటుంబంతో సహా పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. గొటబాయతో పాటు ఆయన అన్నదమ్ములు మొత్తం 15 మంది ఆంటనోవ్ – 32 విమానంలో దేశాన్ని వదిలి మాల్డీవులకు పారిపోయారని అక్కడి మీడియా పేర్కొంటోంది.
రాజపక్స సోదరులు మొత్తం నలుగురు అందరికన్నా పెద్దవాడు చమల్ రాజపక్స. ఆ తరువాత వారిలో మహిందా రాజపక్స, గొటబాయ రాజపక్స, బాసిల్ రాజపక్స ఉన్నారు. ప్రస్తుతం గొటబాయ రాజపక్స కొడుకు నికల్ తో సహా దేశం వదిలినట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రధాన విమానాశ్రయం నుంచే రాజపక్స పరారైనట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. దేశం విడిచి వెళ్లేందుకు రాజపక్స చేసిన ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. జూలై 13న రాజీనామా చేసే లోపే దేశం వదిలి పారిపోవాలని అధ్యక్షుడు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అధ్యక్ష పదవిలో ఉంటే రాజపక్స అరెస్ట్ నుంచి మినహాయించబడతాడు.
అయితే గత శనివారం గొటబాయ శ్రీలంక నేవీ షిప్ గజబాహులో దేశం వదిలిపారిపోయినట్లు వార్తలు వచ్చాయి. యూఏఈకి పారిపోవాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాల్దీవులు పారిపోయినట్లు దాదాపుగా కన్ఫార్మ్ అయింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడ ప్రజలు గొటబాయ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని గత మార్చి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు గొటబాయతో పాటు ప్రధాని మహిందా రాజపక్సతో పాటు రాజపక్స కుటుంబీకుల అవినీతి వల్లే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.