శ్రీలంక మహిళల దుస్థితి.. ఉపాధి కోసం ఒళ్లు అమ్ముకుంటున్న వైనం

0
114

శ్రీలంకలో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి కోసం ఒళ్లు అమ్ముకుంటూ.. వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. ఉద్యోగం లేక ఉపాధి దొరక్క పోవడంతో సెక్స్ వర్కర్లగా మారుతున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో ఆ దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. దీంతొో టెక్స్ టైల్స్ రంగంలో పనిచేసే చాలా మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం మహిళల పాలిట నరకంగా మారుతోంది. ఆర్థిక సంక్షోభం, పేదరికం కారణంగా చాలా మంది మహిళలు వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. మహిళ పరిస్థితులను వాడుకుని అక్కడి స్పా యజమానులు, నిర్వాహకులు మహిళలతో సెక్స్ వర్క్ చేయిస్తున్నారు. కుటుంబం గడవాలన్నా.. పిల్లలకు తిండి పెట్టాలన్నా, మనసుకు ఇష్టం లేకపోవయినా మహిళలు తమ శరీరాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వస్త్రపరిశ్రమల కుంటుపడటంతో ఆ రంగంలో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబాలకు వేరే ప్రత్యామ్నాయం, ఆదాయం లేకపోవడంతో చివరికి వారి భర్తలు కూడా వారిని విడిచిపెడుతున్నారు.

ఇంతకుముందు పట్టణాలకు వచ్చి చిన్నచిన్న ఉద్యోగాలు చేసే మహిళలకు ఉపాధి లేకుండా పోయిందని.. వారు గ్రామాలకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదని.. ఖర్చులు విపరీతంగా పెరగడంతో సంపాదన కోసం సెక్స్ వర్క్ ను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భం దాలుస్తున్నారని స్టాండ్-అప్ మూవ్‌మెంట్ లంక ఎన్జీవోకు సంబంధించి అశిలా దండేనియా చెబుతున్నారు. గతేడాని డిసెంబర్ నుంచి చాలా మంది మహిళలు టెక్స్ టైల్స్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆదాయం లేకున్న సమయాల్లో వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని పలు స్పా నిర్వాహకులు మహిళలను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని..మహిళలు చెబుతున్నారు. చివరకు నిత్యవసరాల కోసం స్థానికంగా ఉండే దుకాణ యజమానులు కూడా మహిళలను శారీరకంగా దోచుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here