ఆకాశంలో పేలిన స్టార్ షిప్ సూపర్ హెవీ..

0
135

ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన, అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం అయింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ శక్తివంతమైన రాకెట్ ‘‘ స్టార్ షిప్ సూపర్ హెవీ’’ని ఈ రోజు ప్రయోగించింది. అయితే ఇది భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటి స్టార్ బేస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే పేలిపోయింది.

ఈ సూపర్ హెవీ రాకెట్ మొత్తం 33 రాఫ్టర్ ఇంజిన్ల సహాయంలో ఆకాశంలోకి బయలుదేరింది. అయితే తొలి దశ తర్వాత రాకెట్ నుంచి సపరేట్ కావాల్సిన బూస్టర్లు విడిపోలేదు. దీంతో రాకెట్ గతి తప్పి ఆకాశంలో అస్తవ్యస్తంగా ప్రయాణించింది. మూడు నిమిషాల తర్వాత రాకెట్ నుంచి బూస్టర్లు విడిపోయేలా ప్లాన్ చేశారు. అయితే ఇవి సపరేట్ కాని కారణంగా నాలుగు నిమిషాల్లోనే ఈ భారీ రాకెట్ అగ్నికి ఆహుతి అయింది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిదద్దుకుంటామని స్పేస్ ఎక్స్ చెప్పింది.

స్టార్ షిప్ ప్రయోగం ఎందుకోసం..?

భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపైకి భారీ మొత్తంలో పేలోడ్ ను తీసుకెళ్లేందుకు ఈ రాకెట్ ను తయారు చేసి ప్రయోగించారు. ప్రస్తుతం పేలిన స్టార్ షిప్ హెవీ భూమిని నుంచి 150 మైళ్ల ఎత్తుకు వెళ్లాల్సిందిగా ప్లాన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మార్గం మధ్యలోనే పేలిపోయింది. స్టార్‌షిప్ సూపర్ హెవీ లిక్విడ్ మీథేన్ (CH4) మరియు లిక్విడ్ ఆక్సిజన్ (LOX) ద్వారా ఇంధనం ద్వారా రాఫ్టర్ ఇంజిన్లతో పనిచేస్తుంది. 2025 చివరిలో చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లాలని నాసా ‘ఆర్టెమిస్-3’’ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. దీని కోసం స్టార్ షిప్ అంతరిక్ష నౌకను ఎంపిక చేసింది.

స్టార్‌షిప్‌లో 164-అడుగుల (50-మీటర్లు) పొడవైన అంతరిక్ష నౌక ఉంటుంది, ఇది 230-అడుగుల బూస్టర్ మొదటి దశలో రాకెట్ పైకెళ్లడానికి సహాయపడుతాయి. గతంలో చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్)ని ఉపయోగించింది. ఎస్ఎల్ఎస్ తో పోలిస్తే స్టార్ షిప్ చాలా శక్తివంతమైంది. ఇది 100 మెట్రిక్ టన్నులను కక్ష్యలోకి పంపించగలదు. 17 మిలియన్ల థ్రస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అపోలో ప్రయోగాల్లో ఉపయోగించిన సాటర్న్-5 రాకెట్ కన్నా రెండు రెట్లు ఎక్కువ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here