AI Tools: విద్యార్థుల సృజనాత్మకత పై ప్రభావం చూపిస్తున్న ఏఐ టూల్స్

0
51

మారుతున్న కాలంతో పోటీపడుతూ అభివృద్ధి చెందుంతుంది టెక్నాలజీ.. ఎంతలా అంటే చిన్న చిన్న పనులని కూడా మనిషి టెక్నాలజీ నిఉపయోగించి పూర్తి చేస్తున్నాడు.. ఇన్ని రోజు శరీరానికి పని చెప్పడం మాత్రమే మానేసిన మనిషిని ఇక పైన మెదడుకి కూడా పనిచెప్పే పని లేకుండా చేస్తున్నాయి ఏఐ టూల్స్..

ఈ రోజు మనిషి ఉపయోగిస్తున్న ప్రతిదీ మనిషి మేధస్సుకు నిదర్శనం.. విద్యార్థి దశ నుండే మనిషి చుట్టూ ఉన్న పరిసరాలనుండి తాను చేస్తున్న పనులనుండి తనలోని సృజనాత్మకతను పెంపొందిచుకుంటాడు.. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పనులకి కూడా ఏఐ టూల్స్ ని వాడుతున్నారు విద్యార్థులు.. ఇది వాళ్ళ సృజనాత్మకత పైన ప్రభావం చూపిస్తాయని ఆందోళన చెందుతున్నాయి కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు..

కాగా తాజాగా ఈ ఏఐ టూల్స్ అమెరికాలో తలనొప్పిగా మారాయి.. సాధారణంగా అమెరికాలో ఏదైనా కళాశాల మరియు విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందాలంటే ముందుగా విద్యార్థులు వాళ్ళ హిస్టరీని వ్యాసం రూపం లో రాసి సమర్పించాలి.. దీని ఆధారంగా విద్యార్థులలో రైటింగ్ స్కిల్స్ ని చూసి దాని ఆధారంగా అడ్మీషన్ ఇస్తారు..

ఈ నేపధ్యలో ప్రస్తుతం ఏఐ టూల్స్ ని ఉపయోగించి వ్యాసాలు పూర్తి చేసి సమర్పిస్తున్నారు.. ఏ వ్యాసం చూసిన అద్భుతంగా ఉంది.. దీనితో ఎవరికీ అడ్మిషన్ ఇవ్వాలో తెలియక వ్యవస్థాపకులు తలలు పట్టుకుంటున్నారు.. ఇది ఇలానే జరిగితే విద్యార్థుల్లో సృజనాత్మకత దెబ్బతింటుందని చాల కళాశాలలు మరియు యూనివర్సిటీలు ఏఐ టూల్స్ వినియోగాన్ని నిషేధించాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here