ప్రపంచంలోనే జనాభా పరంగా ముందుండే చైనా.. ఒకప్పుడు జనాభాని తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టింది.. ఇప్పుడు ఆ చర్యలే కొంపముంచాయి.. రోజురోజుకి పెరుగుతున్న వృద్దుల రేటు తరుగుతున్న యువత రేటు చైనాను వణికిస్తోంది అనే విషయం తెలిసిందే.. కాగా ఈ ముప్పు నుండి తప్పిచుకోవడానికి చైనా సాయశక్తులా ప్రయత్నిస్తుంది.. ఆ ప్రయత్నంలో భాగంగా కొత్తకొత్త చర్యలు తీసుకుంటుంది.. తాజాగా యువతలో పెళ్లి పైన ఆసక్తి కలిగించేలా ఓ పథకాన్ని తీసోక్చింది..
గత వారం చాంగ్‌షాన్ కౌంటీ తన అధికారిక వెచాట్ ఖాతాలో ఒక నోటీసుని ప్రచురించింది.. దీనిప్రకారం వధువుకి 25 లేదా అంతకంటే తక్కువ వయసు ఉంటె ఆ జంటలకు 1,000 యువాన్ల రివార్డ్ ప్రభుత్వం ఇస్తుంది.. యువతలో పెళ్లి పైన మరియు సంతానం పైన ఆసక్తి ని పెంపొందించేందుకు , సంతానోత్పత్తి మరియు విద్య సబ్సిడీల శ్రేణిని కూడా కలిగి ఉంది..
ఏది ఏమైనా చైనా దేశంలో యువత తక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.. ఇలానే సాగితే భవిష్యత్తులో చైనా ఆర్ధిక వ్యస్థ కుప్పకూలేందుకు ఎంతోకాలం పట్టదు.. దీనితో ముంచుకొస్తున్న ముప్పునుండి ఎలాగైనా తప్పించుకోవాలని చైనా తీవ్రంగా శ్రమిస్తోంది.. యువతలో పెళ్లి పట్ల.. సంతానం పట్ల అవగాహన కల్పించడంలో నిమగ్నమై ఉంది చైనా.. ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు మెరుగైన పిల్లల సంరక్షణ సౌకర్యాలతో సహా జనన రేటును పెంచడానికి కూడా అత్యవసరంగా అనేక చర్యలకు పూనుకుంటుంది.