వర్క్ ఫ్రం హోం ఆ దేశంలో చట్టబద్ధం..

0
188

వర్క్ ఫ్రం హోమ్ అనేది చాలా మంది ఉద్యోగుల్లో భాగంగా మారింది. కరోనా వల్ల గత రెండేళ్లుగా చాాలా మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుల నుంచి పిలుస్తున్నా సరే.. ఇంటి నుంచి పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరోనా పుణ్యమా అని పని సంస్కృతిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లోని ఉద్యోగులు ఎక్కువగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గత రెండేళ్ల నుంచి ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏకంగా యూరోపియన్ కంట్రీ నెదర్లాండ్స్ వర్క్ ఫ్రం హోం ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లును నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆ దేశ చట్ట సభల్లోని దిగువసభలో ప్రవేశపెట్టింది. దీన్ని సభ ఆమోదించింది. ఎగువసభ కూడా ఆమోదిస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ద్వారా ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని వర్క్ ఫ్రం హోం కోసం డిమాండ్ చేయవచ్చు.

వర్క్ ఫ్రం హోంను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా ప్రపంచంలో నెదర్లాండ్స్ నిలవనుంది. మరోవైపు మరికొన్ని దేశాలు కూడా వర్క్ ఫ్రం హోం చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్కాట్కాండ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు వర్క్ ఫ్రం హోం చేసుకునే ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే అందుకు బదులుగా జీతాల్లో కోత విధిస్తామని చెప్పింది. దీంతో ఈ అంశం అక్కడ వివాదాస్పదం అయింది.

అయితే కరోనా తగ్గముఖం పట్టడంతో చాలా దేశాల్లో ఉద్యోగులను కంపెనీలు ఆఫీసులకు రమ్మని చెబుతున్నాయి. ఆఫీసులకు వస్తేనే పని మరింగా మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించారు.. అలా చేయకపోతే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వంటి వారు కూడా వర్క్ ఫ్రం హోంను వ్యతిరేకిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here