అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలో ముందుండి ప్రపంచం పైన పెద్దన్న పాత్ర పోషిస్తుంది.. అభివృద్ధిలోనే కాదు ఆధునికత ముసుగులో విచ్చలవిడి స్వేచ్ఛలోనూ అమెరికా ముందే ఉంటుంది.. ఆ స్వేచ్ఛ ఎంతలా ఉంటుంది అంటే బజార్లలో కూరగాయలు అమ్మినట్టు ఆయుధాల్ని విక్రయిస్తారు.. ఆత్మరక్షణ పేరుతో దాదాపు అందరి దగ్గర మారణ ఆయుధాలు ముఖ్యంగా తుపాకులు ఉంటాయి..
మన సీరియల్స్ లో లేడీ విలన్ మాటకి ముందు గన్ తీసి హీరోయిన్ కి గురిపెట్టినట్టు.. అమెరికాలో మాట్లాడకముందే గన్ తో షూట్ చేసి నాకేం తెలియదు అన్నట్టు జారుకుంటారు.. ఆపైన పోలీసులకి చిక్కి లాకప్ లో ఉంటారు.. ఇలాంటి ఘటనలు కోకొల్లలు అమెరికాలో.. కేవలం జాతి వివక్షతతో విచక్షణారహితంగా ఎదుటి వ్యక్తిని కాల్చి చంపినా ఘటనలు ఎన్నో.. అమెరికా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ఫలితం మాత్రం శూన్యం.. తాజాగా దుండగులు జరిపిన కాల్పులలో ఒక ప్రొఫెసర్ మృతి చెందారు..
నార్త్ కరోలినాలోని చాపెల్ హిల్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో దారుణం చోటు చేసుకుంది.. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం దాదాపు 2 గంటల ౩౦ నిమిషాల సమయంలో దుండగులు యూనివర్శిటీలోని సైన్స్ భవనంలో కాల్పులు జరిపాడు.. ఈ కాల్పులలో ఒక ప్రొఫెసర్ మృత్యువాత పడ్డారు.. కాగా తక్కిన వారికి ఎవరికీ అటువంటి ప్రమాదం జరగలేదు.. దీనితో కావాలనే ప్రొఫెసర్ ఒక్కరి పైనే దాడి జరిపారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి..
కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పైన దర్యాప్తు చేపట్టారు.. నిందితునిగా అనుమానము ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.. కాగా విశ్వవిద్యాలయంలో లాక్ డౌన్ తీసేసిన గంటల వ్యాధిలో ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం.. దీనితో విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు.. ఇదేకాకుండ గత శనివారం జాతి వివక్షతతో ఒక వ్యతి ముగ్గురు బ్లాక్ అమెరికన్స్ ని కాల్చి చంపాడు అనంతరం నిందితుడు కూడా కాల్చుకుని చనిపోయారు..