ఉరుకుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ కి అలసయం అవుతుందనో, లేదా ఇంకేదైనా అర్జెంటు పని మీద వెళ్తున్నప్పుడో మనలో చాలంది షార్ట్ కట్ రూట్ ని ఎంచుకుంటారు.. కొన్నిసార్లు యూటర్న్ తీసుకోవడనికి బద్దకించి ఆలస్యం అవుతుందని రోడ్ పైన ఉన్న డివైడర్ ని తొలిగుంచి కొందరు వెళ్తుంటారు..
కానీ ఎవరైనా షార్ట్ కట్ కోసం చారిత్రాత్మక కట్టడాల్ని పాడు చేస్తారా? చేస్తారు అని నిరూపించారు ఓ ఇద్దరు వ్యక్తులు.. ఈ సంఘటన మన పోరుగున ఉన్న డ్రాగన్ దేశంలో ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద ఉన్న యాంగ్‌కాన్హె టౌన్‌షిప్ వద్ద చోటు చేసుకుంది..
వివారాలలోకివెళ్తే గ్రేట్ చైనా వాల్ కు సమీపంలో ఓ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది.. ఈ కన్‌స్ట్రక్షన్ లో 38 ఏళ్ల ఓ వ్యక్తి, మరియు 55 ఏళ్ల ఓ మహిళ పనిచేస్తున్నారు.. కాగా చైనా వాల్ అడ్డుగా ఉండడంతో ఇద్దరు రోజు కన్‌స్ట్రక్షన్ జరిగే ప్రాంతానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది.. అలానే ఖర్చు కూడా అధికంగా అవుతుంది..
అందుకే ఆ చైనా వాల్ దగ్గర కొంచం దారి చేరుకుంటే సులభంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అనుకున్నారు.. దీనికి తోడు ఆ చైనా వాల్ కి చిన్న రంద్రం పడిఉంది.. ఇదే అదునుగా అనుకున్నదే తరువుగా పని ప్రారంభించారు ఆ ఇద్దరు.. చిన్నగా ఉన్న రంద్రాన్ని కొద్దీ రోజుల్లోనే పెద్దదిగా చేశారు.. ఎంతలా అంటే వాళ్ళ వాహనాలు ఆ దారిన వెళ్ళేటంత పెద్ద రంద్రం పెట్టారు..
ఇది తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.. వాళ్ళు చేసిన పని వల్ల చైనాకి తీవ్ర అన్యాయం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.. అసలు వాళ్ళు ఆ గోడకి అంత రంద్రం ఎలా చేశారా అని సి.సి టీవీలని పరిశీలిస్తూన్నారు.. కాగా చైనా వాల్ ప్రపంచ వింతల్లో ఒకటి.. ఈ వాల్ నిర్మాణకి చాల సమయం పట్టింది.. క్రి.పూ 200 సంవత్సరంలో ప్రారంభమైన దీని నిర్మాణం క్రి.శ 1600 సంవత్సరంలో పూర్తయింది.. దాని విలువ తెలియక ఇద్దరు కొన్ని రోజుల్లో కన్నం పెట్టేశారు.