ప్రధాని పీఠానికి చేరువలో రిషి సునక్.. ఐదో రౌండ్లో కూడా విజయం

0
121

యూకే ప్రధాని పీఠానికి ఒకే అడుగు దూరంలో ఉన్నాడు భారత సంతతి వ్యక్తి రిషి సునక్. తాజాగా బుధవారం జరిగిన ఐదో రౌండ్లో కూడా విజయం సాధించాడు. ప్రధాని పీఠం కోసం రిషి సునక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐదో రౌండ్లో చివరిదైన ఐదో రౌండ్లో రిషి సునక్, లిజ్ ట్రస్ నిలిచారు. వీరిద్దరి మధ్యే ప్రధాన మంత్రి పోటీ ఉండబోతోంది. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి నిష్క్రమించారు. ఐదో రౌండ్ లో రిషి సునక్ కు 137 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. లిజ్ ట్రస్ కు 113 ఓట్లు వచ్చాయి. పెన్నీ మోర్డాంట్డ 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయ్యారు. బ్రిటన్ ప్రధానిగా ఈ సారి రిషి సునక్ అయ్యే అవకాశం ఉందని అక్కడి మీడియా పేర్కొంటోంది. అయితే లిజ్ ట్రస్, రిషి సునక్ మధ్య తీవ్ర పోటీ కూడా ఉంటుందని చెబుతోంది.

ఇక కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని ఆ పార్టీలో సభ్యులుగా ఉన్న 1,80,000 మంది బ్యాలెట్ పద్దతిలో ఎన్నుకోనున్నారు. ప్రధాని పీఠం కోసం మూడో వంతు సభ్యుల మద్దతు లేదా 120 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రధానిగా ఎవరు గెలిచారనే విషయాన్ని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. ఈ సారి ప్రధానిగా రిషి సునక్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రిషి సునక్ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షిత మూర్తిని రిషి సునక్ వివాహం చేసుకున్నారు. 42 ఏళ్ల రిషి సునక్ యూకే ప్రధాని అయితే.. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా.. మొదటి దక్షిణాసియాకు చెందిన ప్రధానిగా రికార్డులకెక్కనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here