10 మంది పిల్లలను కనండి… రూ.13 లక్షలు పట్టేయండి…!

0
137

కొన్ని దేశాలు జనాభా పెరిగిపోతుందని ఆందోళన చెందుతుంటే.. మరికొన్ని దేశాలు జనాభా తగ్గిపోతుందని అప్రమత్తం అవుతున్నాయి.. జనాభా తగ్గిపోతుండటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు.. కొత్త స్కీమ్‌ ప్రకారం పది మంది పిల్లల్ని కనడం, వారిని బతికించగలిగితే.. ఆ తల్లులకు ఒకేసారి 13,500 పౌండ్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం రూ.13 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు.. “వీర మాతృమూర్తి” -“ఆదర్శ మాత” పథకాన్ని ప్రవేశపెట్టారు పుతిన్… రష్యాలో జనాభా పెరుగుదలే లక్ష్యంగా పలు ప్రోత్సాహాకాలు ప్రకటించారు.. అనేక ఇతర ప్రోత్సాహాకాలలో ఆర్ధిక ప్రోత్సాహకం ఒకటిగా ఉంది..

రష్ లో తరిగిపోతున్న జనాభా పెరిగేలా పలు చర్యలు, ప్రోత్సాహాకాలను ప్రకటించారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్‌తో యుధ్ధం, కోవిడ్ మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలే రష్ లో జనాభా తరుగుదుల సంక్షోభానికి ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.. గత్యంతరం లేకనే ఈ వినూత్న పథకానికి పుతిన్ శ్రీకారం చుట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. పెద్ద కుటుంబాలున్నవారు పెద్ద దేశ భక్తులని ఉద్భోదిస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్… ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో సుమారు 15 వేల మంది సైనికులు మరణించినట్లు అంచనా వేస్తున్నారు.. మరోవైపు, ఈ ఏడాది మార్చి నుంచి రష్యాలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి.. పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లతో రష్యాలోని ఆస్పత్రులు నిండిపోతున్నాయి.. గత రెండేళ్లలో రష్యాలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయని చెబుతున్నారు.

మొత్తంగా రష్‌యాలో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.. 10 మంది పిల్లలను కనడంతో పాటు, వారిని బతికించగలిగితే, తల్లులకు ఒకేసారి 13,500 పౌండ్లు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు.. అయితే, 10 మంది లేదా అంతకు మించి పిల్లలను కని, పెంచాలని ఎవరనుకుంటారు…!? అనేక ఇతరత్రా ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యలు కూడా ఇమిడి ఉన్నాయి కదా? అని ప్రశ్నిస్తున్నారు సామాజిక విశ్లేషకులు.. వాస్తవానికి రష్యా ఎదుర్కుంటున్న జనాభా సమస్యను అధిగమించేందుకు 1990 నుంచి అప్పుడప్పుడు జనాభా పెరిగేలా పలు దఫాలు ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు.. ఇక, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనేలా రష్యా మహిళలను ప్రోత్సాహిస్తూ పుతిన్ చర్యలు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here