Volcano Erupt: ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వతం బద్ధలైంది.. 39 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి

0
126

ప్రపంచంలోనే అతిపెద్దదైన చురుకైన అగ్నిపర్వతం బద్దలైంది. హవాయిలోని మౌనాలోవా అగ్ని పర్వతం లావాను వెదజిమ్ముతోంది. గత 39 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం ఆదివారం బద్దలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రకాశవంతం అయిన లావా అగ్నిపర్వతం నుంచి వెదజిమ్ముతోంది. అగ్నిపర్వతం నుంచి వచ్చే వాయువులు, బూడిత జనావాసాల్లోకి రావచ్చని అక్కడి ప్రజలు అధికారులు హెచ్చరించారు.

ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా దాని శిఖరం దిగువనేే ఉందని.. దిగువ ఉన్న జనావాసాల వద్దకు రాదని యూఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. ప్రపంచంలోనే అతి చురుకైన అగ్నిపర్వతంగా మౌనా లోవాకు పేరుంది. చివరిసారిగా 1984లో విస్ఫోటనం చెందింది. ఆ తరువాత ఇప్పుడే మళ్లీ క్రియాశీలకంగా మారింది. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల హవాయిలోని ఆకాశం ఎర్రగా మారింది.

మౌనా లోవా పసిఫిక్ మహాసముద్రం నుంచి 13,679 అడుగుల(4,169 మీటర్లు) ఎత్తులో ఉంది. హవాయిలోని అగ్నిపర్వతాల గొలుసులో భాగంగా మౌనా లోవా ఉంది. 39 ఏళ్ల క్రితం ఇది బద్ధలు అయినప్పుడు అతిపెద్ద నగరం అయిన హిలో నుంచి 5 మైళ్ల వరకు లావా ప్రవహించింది. ముందుజాగ్రత్తగా ద్వీపంలో రెండు రక్షణ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే హవాయిలోని జనావాసాలకు ముప్పు కలిగించే సంకేతాలు ఏవీ లేవని.. ఇప్పటి వరకు ప్రజలకు ఎటువంటి తరలింపు ఆదేశాలను జారీ చేయలేదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. హవాయిలో ఐదు అగ్నిపర్వాతాలు ఉన్నాయి. వీటిలో నాలుగు క్రియాశీలకంగా ఉన్నాయి. కిలౌయా, మౌనా లోవా, మౌనా కీ, హులాలై క్రియాశీలకంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here