Meta: కార్యాలయానికి వస్తేనే కొలువు.. కుదరదంటే ఇంట్లో ఉంటావు.. మేటా వార్నింగ్

0
48

ఉరుకుల పరుగుల జీవితం.. ఉదయం లేవాలి.. రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాలి.. మధ్యలో ట్రాఫిక్ జామ్ లు.. ఆలస్యం అయిందా పైధికారులతో చివాట్లు.. అందరి ఉద్యోగుల పరిస్థితి ఇదే.. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి చెప్పనవసరం లేదు.. వీళ్ళకి సంపాదన లక్షల్లో అయినా కడుపునిండా తిని కంటినిండా నిద్రపోవడానికి సమయం ఉండదు.. అందుకే లక్షల జీతంతో పాటు బి. పి షుగర్ లు కూడా లక్షణంగా వచ్చేస్తాయి..

అయితే కరోనా పుణ్యమా అని ఉద్యోగులకి ఇంటి నుండి పని చేసుకునే అవకాశం లభించింది.. దీనితో పని భారం తగ్గకపోయినా.. ఆఫీస్ కి వెళ్లే పని తప్పింది.. సమయానికి వెళ్లకపోతే పై అధికారులు తిడతారు అనే టెన్షన్ తగ్గింది.. అయితే కరోనా సమయంలో ఉద్యోగుల ఆరోగ్య దృష్ట్యా ఈ అవకాశాన్ని కల్పించారు.. కాని కొరోనా కనుమరుగయ్యి చాలా కాలం అవుతున్న.. కర్యాలయాలకి రావాలని సంస్థలు అదేసిస్తున్న.. కార్యాలయానికి రాకుండ ఏదేదో కారణాలు చెప్తూ తప్పించుకుంటున్నారు ఉద్యోగులు.. మరి ఏం చేస్తారువర్క్ ఫ్రొం హోమ్ కి అలవాటు పడిన ప్రాణాలు.. అయితే ఇక పైన మీ ఆటలు సాగవు.. కార్యాలయానికి రాకపోతే మీ ఉద్యోగం పోతుందని హెచ్చరికలు చేశారు జుకర్‌బర్గ్. .

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా తన ఉద్యోగులకు సీరియస్ నోటీసు జారీ చేసింది.. ప్రతి వారం కనీసం మూడు రోజులు అయినా కార్యాలయంకి వచ్చి పనిచెయ్యాలని నిబంధనను జారీ చేసింది.. మంచి సంబంధాలు మరియు బలమైన టీమ్‌ వర్క్‌ ని మెరుగు పరచాలనే ఉద్దెశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపైన కట్టిన చర్యాలు తీసుకొనబతాయని, ఉద్యోగులను విధుల నుండి తొలిగిస్తామని తెలియచేసారు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. సెప్టెంబర్ 5 నుండి కార్యాలయానికి కేటాయించిన ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు భౌతికంగా హాజరు కావాలని భావిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here