పెళ్లి, పిల్లలు లేకపోతే చచ్చిపోతామా.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

0
133

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం టబు, అజయ్ దేవగణ్ నటిస్తున్న భోళా సినిమాలో నటిస్తోంది. ఇక ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదన్న విషయం విదితమే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించింది.

“తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది. దీనికోసం పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అంటూ ఫోర్స్ చేయాలా..? అయినా పెళ్లి కాకపోయినా.. పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామా ఏంటి?. పెళ్లి గురించి నాకొక క్లారిటీ ఉంది. నాకు నచ్చినవాడు దొరికాక పెళ్లి చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అదేంటి ఎప్పుడు లేనిది టబు అంత బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది అంటూ నెటిజన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక మరికొంతమంది.. అవును పెళ్లి చేసుకొని రెండేళ్లు లో విడిపోవడం కన్నా ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అని చెప్పుకొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here