గుడ్ న్యూస్ షేర్ చేసిన సీత.. విషెస్ తెలుపుతున్న నెటిజన్‌లు

0
967

బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. వీళ్లిద్దరూ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాల వల్ల వివాహం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న పెద్దల సమక్షంలో ఆలియా-రణ్‌బీర్‌ కపూర్ ఒక్కటయ్యారు. వివాహం తర్వాత కూడా వీళ్లిద్దరూ తమ కెరీర్‌లో బిజీ బిజీగా ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ పలు చిత్రాల షూటింగులను పూర్తిచేశారు. అందులో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో రణ్‌బీర్, ఆలియా కలిసి నటిస్తున్నారు. రణ్‌బీర్ ఈ సినిమానే కాకుండా ‘షంషేరా’, ‘యానివల్’ మూవీస్ చేస్తున్నాడు. అటు ఆలియాభట్ ‘డార్లింగ్స్’, ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాలలో నటిస్తోంది.

తాజాగా ఆలియా-రణ్‌బీర్ జంట తమ అభిమానులకు గుడ్‌న్యూస్ అందించింది. తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆలియాభట్ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో రణ్‌బీర్ కూడా కనిపిస్తున్నాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కానింగ్ చేయించుకుంటోన్న పిక్‌తో పాటు రెండు సింహాలు.. ఓ చిన్న సింహం కూనతో కలిసున్న ఫొటోను కూడా ఆలియా షేర్ చేసింది. దీంతో ఆమె గర్భవతి అయిందని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు నెటిజన్‌లు విషెస్ తెలుపుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ సీతగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here