దేశంలో నిర్వహించిన ఓ పరిశోధనలో పేరుగాంచిన అనేక మంది తారలను అధిగమించి స్టార్ హీరోయిన్ సమంత అగ్రస్థానంలో చోటు సంపాదించింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్‌గా సమంత నిలిచింది. ఆలియా భట్, నయనతార, దీపికా పదుకునే లాంటి వాళ్లను కూడా ఆమె వెనక్కి నెట్టేసింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పుపై ORMAX మీడియా ఓ సర్వే నిర్వహించింది. మే నెలలో నిర్వహించిన ఈ సర్వేలో సమంత, ఆలియాభట్, నయనతార, దీపికా పదుకునే, కాజల్ అగర్వాల్ మొదటి ఐదు స్థానాల్లో నిలవగా, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజా హెగ్డే, అనుష్క శెట్టి తర్వాతి ఐదు స్థానాలను సంపాదించారు.
ఏమాయ చేశావె సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఆ తర్వాత వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అందం, విలక్షణత, ప్రతిభ చాటుకుంటూ దేశంలోనే టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా పేరు సంపాదించింది. నటిగానే కాకుండా, ఒక సామాజిక సేవాకర్తగా, వ్యాపారవేత్తగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ సమంత పేరు తెచ్చుకుంది.