Astrologer Venu Swamy Prediction On Pawan Kalyan Fourth Marriage: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ఇప్పటికే రాజకీయ నేతలు ఎత్తిచూపుతున్నారు. పవన్ పెళ్లిళ్లతో రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఆయన్ను ఎటాక్ చేసేందుకు ఆ పెళ్లిళ్ల మేటర్‌ను ప్రతీసారి అస్త్రంగా వాడుకుంటున్నారు. మైక్ దొరికినప్పుడల్లా ‘మూడు పెళ్లిళ్ల’ టాపిక్ తప్పకుండా తెస్తూనే ఉంటారు. ఇలాంటి తరుణంలో పవన్ నాలుగో పెళ్లి కూడా చేసుకోనున్నాడంటూ ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి కుండబద్దలు కొట్టారు. అది ఇప్పుడైనా కావొచ్చు, సంవత్సరం తర్వాతైనా కావొచ్చు.. కానీ నాలుగో పెళ్లి జరగడం మాత్రం తథ్యమని ఆయన బాంబ్ పేల్చారు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలుత చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వేణు స్వామి.. ఆమెది, పవన్ కళ్యాణ్‌ది ఒకటే జాతకమని అన్నారు. వారి జాతకరీత్యా.. ఇద్దరికి మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు జరుగొచ్చని జోస్యం చెప్పారు. ఇప్పటికే శ్రీజకి రెండు పెళ్లిళ్లు అయ్యాయని, త్వరలోనే స్నేహితుడితో మూడో పెళ్లి చేసుకోనుందని, ఆ సంబంధం కూడా తేడా కొట్టి నాలుగో పెళ్లికి ఆ అమ్మాయి సిద్ధమవుతుందని వేణు స్వామి వెల్లడించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కీ నాలుగో పెళ్లి జరుగుతుందని పేర్కొన్నారు. ఇది తానేమీ కావాలనే కల్పించి చెప్పట్లేదని, జాతకం ప్రకారమే జోస్యం చెప్తున్నానని స్పష్టం చేశారు. పొలిటికల్ లీడర్ అయినంత మాత్రాన నాలుగో పెళ్లి చేసుకోకూడదన్న రూల్ ఏమీ లేదని, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని కూడా వేణుస్వామి చెప్పడం గమనార్హం.
ఇంతకుముందు నాగ చైతన్య, సమంత రిలేషన్‌షిప్‌పై.. అలాగే అఖిల్ పెళ్లిపై వేణుస్వామి చెప్పిన జోస్యం నిజమైంది. మరి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, శ్రీజలపై చెప్పిన ప్రెడిక్షన్ నిజమవుతుందా? లేదా? అన్నదే చూడాలి. గతంలో నిజమైన సందర్భాలున్నాయి కాబట్టి.. శ్రీజ, పవన్ విషయాల్లోనూ ఆయన జోస్యం నిజం కావొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ!