బాలీవుడ్ వంటి ప్రఖ్యాత వేదికపై నటిగా, మోడల్‌గా రాణించడం అంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అద్భుతమైన నటనా నైపుణ్యం, నిరంతర సాధన, వ్యక్తత్వపు విలువలను పాటిస్తేనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటిది తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ నటనలో, మోడలింగ్‌లోనూ ముంబై అందాల తార హీర్ అచ్రా దూసుకుపోతుంది.
సినిమాలు, యాడ్స్‌తో తీరిక లేకుండా అభిమానులు ఆదరణలు పొందుతూ ఇండస్ట్రీకి హీర్ అచ్రా మరో స్టార్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో టాప్ సోషల్ సెలబ్రిటీగా అలరిస్తోంది. ఈ ఆదరణ పేరు ప్రఖ్యాతలు ఒక్క రోజులో వచ్చినవి మాత్రం కాదు. తనకంటూ విభిన్నమైన విధి విధానాలతో, ఎక్కడ సృజనాత్మకత ఉంటే అక్కడ తన నైపుణ్యాలతో రాణిస్తూ ప్రస్తుతం ప్రముఖ దర్శకులతో పని చేసే అవకాశాలను సంపాదించుకుంది. ఇందులో భాగంగానే ప్రముఖ గుజరాతీ చిత్రాలు సూర్యాంశ్, పటేల్ వర్సెస్ పెట్రిక్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడమే కాకుండా నటిగా మరిన్ని ఆఫర్లను తీసుకువచ్చాయి.
పలు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు పొందిన హీర్ అచ్రా బాలీవుడ్‌లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫేమస్ యాక్టర్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఒక యాడ్ షూట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం బాలీవుడ్ టాప్ యాక్టర్లతో పనిచేస్తుంది. అటు సినిమాలు, ఇటు యాడ్స్‌తో తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్‌ను పెంచుకుంటుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్‌లు సన్ సిల్క్, నివియా, మియా జ్యువెలరీ తదితర బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌డా, యాడ్ మోడల్‌గా పనిచేయడం విశేషం.
ఒక్క మాటలో చెప్పాలంటే హీర్ అచ్రా యాడ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నటన, మోడలింగ్ అంశాల్లో తన ప్రయాణానికి టెమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2018 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ బిరుదును పొందింది. అంతేకాదు.. ఎఫ్‌బీబీ ఫెమీనాతో పాటు మిస్ గుజరాతీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకుంది. క్యాట్ వాక్‌తో, యాక్టింగ్‌స్కిల్స్‌తో గ్లామర్ ఫీల్డ్‌లో స్థానం సంపాదించుకోవడం ఒక ఎత్తైతే దానిని కాపాడుకోవడం నిరంతర పట్టుదల, నైపుణ్యాలపైన అధారపడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాలను సకాలం చేరుకుంటామని, దానికి నిదర్శనం తానేనని హీర్ అచ్రా నిరూపించింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఈ యువ అందాల తారతో విభిన్నమై ప్రాజెక్ట్‌లను నిర్వహించడానికి ప్రముఖ ప్రొడక్షన్‌లు సంప్రదిస్తున్నాయి. హీర్ అచ్రా చేయబోయే యాడ్స్, మోడలింగ్ తదితర వ్యవహారాలను ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ ‘రన్ వే లైఫ్‌స్టైల్’ పర్యవేక్షిస్తుంది.