బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు చేయడంతో NTRను చూసే ఛాన్స్ పోయిందని వాపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చామని, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. NTR దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నందుకు తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఎన్టీఆర్ నిన్న (శుక్రవారం) సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాపై మాట్లాడారు. ఈవెంట్ వేదికకు వచ్చిన.. రావాలనుకున్న నా అభిమానులకు ముందుగా క్షమాపణలని, మీరు వేడుకకు రాకపోయినా మంచి చిత్రాలను, నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. అంతేకాదు మీడియానూ కూడా క్షమాపణలు కోరుకుతున్నా అని అన్నారు. వినాయక విగ్రహ నిమజ్జనాల నేపథ్యంలో అధిక బందోబస్తును ఏర్పాటు చేయలేమని పోలీసులు తెలుపడంతో.. వారు చెప్పింది వినటం మన ధర్మమని, అందుకే వారికి సహకరించి మేం ఇలా చిన్న వేదికపై నుంచి మీతో మాట్లాడుతున్నామన్నారు. తను కూడా చాలా మంది నటులను ఇష్టపడతా, అమితాబ్ బచ్చన్ ప్రభావం ఓ నటుడిగా నాపై చాలా ఉంది. అయితే.. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన తరువాత నేనంతగా ఇష్టపడేది రణ్‌బీర్‌నే.
అందుకే అతనితో కలిసి ఈ వేదికను పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు అని తెలిపారు. ఈచిత్రానికి అలియా, అయాన్.. పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. టాలీవుడ్ నటుడు హిందీ సినిమాలో నటించి, హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందనేది నాగార్జున బాబాయ్ ఖుదా గవా చూసి తెలుసుకున్నా అని అన్నారు. ఇక బ్రహ్మాస్త్రంలోనూ ఆయన హిందీ మాట్లాడారనుకుంటున్నానని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో చిత్ర పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోంది, ప్రేక్షకుడికి ఇప్పుడు మనం ఇస్తున్నదానికంటే కొత్తది ఇంకేదో కావాలి. ఇలాంటి ఒత్తిడిలోనే బాగా పనిచేస్తామని నేను నమ్ముతానని అన్నారు ఎన్టీఆర్.. ఈ ఛాలెంజ్‌ని ఇండస్ట్రీ స్వీకరించాలన్నారు. అయితే.. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదని అన్నారు ఎన్టీఆర్. తన అభిమానులకు, ప్రేక్షకులకు మంచి కథలను అందించేందుకు ప్రయత్నిద్దామని మరిన్ని గొప్ప చిత్రాలు చేద్దాం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.