అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయి : చందు మొండేటి

0
38

టాలీవుడ్‌లో హిట్‌ల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చి తెలుగు సినీ పరిశ్రమను మరోసారి సత్తా చాటాయి. అయితే.. తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా సైతం.. అద్భుతంగా ఉందంటూ.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అయితే..ఎలాంటి హడావిడి లేకుండా సైలంట్‌గా వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూల్లు రాబడుతోంది. ఈ సినిమాల నిఖిల్‌ సిద్దార్థ్‌ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌ పాత్రకు న్యాయం చేసింది. అయితే.. అంతేకాకుండా వైవా హర్ష, శ్రీనివాస్‌రెడ్డిలు పాత్రలు సైతం అందరిని అలరించాయి. అయితే.. మొదట నార్త్ లో 50 స్ర్కీన్‌లలో విడుదలైన ఈ చిత్ర ఇప్పుడు వెయ్యికి పైగా స్త్ర్కీన్‌లలో ప్రదర్శించబడుతోంది.

 

అంతేకాకుండా.. ఇప్పుడు హిందీలో సైతం విడుదలైన ప్రేక్షకుల ఆదారణ పొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు. అయితే.. అమితాబ్‌ బచ్చన్‌ను కలిసిన ఫోటోను పంచుకుంటూ.. అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. కార్తికేయ-3 సినిమాపై కూడా దర్శకుడు చందు మొండేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కార్తికేయ-3 సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here