జన గణ మన సినిమా రద్దయ్యిందని నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. ఇది పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల డ్రీమ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ.. లైగర్ ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టేశారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ హిట్ అయితే డబ్బులొస్తాయని, ఆ వచ్చే డబ్బులతోనే జన గణ మన చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించాలని మేకర్స్ అనుకున్నారని, కానీ లైగర్ రిజల్ట్ వల్ల నష్టాలు రావడంతో వెనక్కు తగ్గారని వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ, విజయ్ కలిసి చర్చించాకే, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టాక్స్ నడిచాయి.
ఇలాంటి సమయంలో చార్మీ కౌర్ ఒక ట్విస్టింగ్ ట్వీట్ చేసి, కాస్త గందరగోళానికి గురి చేసింది. నేరుగా జన గణ మన ప్రాజెక్ట్ ప్రస్తావన తీసుకురాలేదు కానీ, రూమర్లను నమ్మొద్దు అన్నట్టు చిల్ గాయ్స్ అంటూ చెప్పింది. ఆ తర్వాత కొంత విరామం మాత్రమే తీసుకుంటున్నామని తెలిపిన చార్మీ, దాని పక్కనే సోషల్ మీడియా నుంచి అంటూ బ్రాకెట్‌లో పెట్టి మరో ట్విస్ట్ ఇచ్చింది. చివర్లో పూరీ కనెక్ట్స్ తప్పకుండా బౌన్స్ బ్యాక్ ఇస్తుందని.. ఈసారి అంతకుమించిన కంటెంట్‌తో ముందుకు వస్తామని తెలిపింది. అప్పటివరకూ ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే బెటర్ అన్నట్టుగా చార్మీ ట్వీట్ చేసింది. అయితే.. ఈ ట్వీట్‌లో పూర్తి స్పష్టత లేకపోవడంతో, చార్మీ ఏం చెప్పాలనుకుందో సరిగ్గా అర్థం కావడం లేదు.
కాగా.. ఇంకా లైగర్ విడుదల కాకముందే ఈ ఏడాది మార్చి చివర్లో ‘జన గణ మన’ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ మరుసటి రోజు ప్రెస్‌మీట్ నిర్వహించి, సినిమా విశేషాల్ని వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. లైగర్ చిత్రాన్ని రిలీజ్ కాకముందే జూన్ 4వ తేదీన షూటింగ్ ప్రారంభించి, ఒక షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారు.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022