సమంతతో నా జర్నీ ముగిసిందంటూ బాంబ్ పేల్చిన చిన్మయి

0
114

సినీ పరిశ్రమలో ఉన్న మంచి స్నేహితుల్లో సమంత, చిన్మయి శ్రీపాద ద్వయం ఒకటి. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఏర్పడిన వీరి బంధం.. సినిమా, సినిమాతో మరింత బలపడుతూ వచ్చింది. ఎంతలా అంటే, వివాదాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు మద్దతు కూడా ఇచ్చుకుంటారు. విమర్శకులకు కలిసే కౌంటర్లు ఇస్తారు. అలాంటి వీరి మధ్య కొంతకాలం నుంచి విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. తరచూ సోషల్ మీడియాలో కలిసి ఏదో ఒక అప్డేట్ ఇచ్చే వీళ్లు, చాలారోజుల నుంచి అలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఏదో తేడా కొట్టింది కాబట్టే, వాళ్లు దూరం పాటిస్తున్నారనే ప్రచారాలు జోరుగా సాగాయి.

అయితే.. ఆ ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా చిన్మయి తేల్చి చెప్పేసింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదని, తామిద్దరం ఎప్పట్లాగే చాలా సాన్నిహిత్యంగానే మెలుగుతున్నామని క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం కలిసి సోషల్ మీడియాలోఫోటోలు పెట్టనంత మాత్రాన, తాము విడిపోయినట్లు కాదని తేల్చి చెప్పింది. తాము రెగ్యులర్‌గా కలుస్తుంటామని.. పార్టీలకు, డిన్నర్లకు వెళ్తుంటామని తెలిపింది. తాము కలిసే విషయం ఇతరులకు చెప్పడం వల్ల ఎలాంటి లాభం లేదు కాబట్టి, తాము కలుస్తున్నామన్న విషయాన్ని చెప్పడం లేదని పేర్కొంది. తాము తమ ఇళ్లల్లోనే కలుసుకుంటుంటామని వెల్లడించింది. సమంత వల్లే తనకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి కెరీర్ వచ్చిందని.. కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సమంతతో తన ప్రయాణం ఇప్పుడు ముగిసినట్టేనని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు సమంతే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటోందని, ఆమెకు తన గాత్రం అవసరం లేదని చిన్మయి చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here