అతను ఫుల్‌ ఎనర్జీతో వుంటాడు? ఎవడతను?

0
180

లైగర్‌ అంటూనే మనకు గుర్తుకు వచ్చే విజయ్‌ దేవరకొండ, తల్లి పాత్రపోషించిన రమ్యకృష్ణ. టాలీవుడ్‌లో తన నటనతో.. అందచందాలతో మంత్రమగ్ధుల్ని చేసి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. బాహుబలిలో ఇద్దరి నటవారసులుకు తల్లి పాత్ర పోషించి మంచి క్రేజ్‌ సంపాదించుకు నటి రమ్య. ఇప్పడు లైగర్‌ సినిమాలో విజయ్‌ దేవర కొండకు తల్లిగా నటించింది. అయితే లైగర్‌ సినిమా ఆగస్టు 25న రిలీజ్‌ డేట్ దగ్గరపడుతుండటంతో.. లైగర్‌ ప్రచారంలో టాలీవుడ్‌ నటులంతా ముంబయిలో బిజీబిజీగా గడుపుతూ.. హీరోహీరోయిన్లు ఒక చోట ప్రచారం చేస్తుంటే.. ఇక దర్శక నిర్మాతలు మాత్రం మరోచోట సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

లైగర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న నటి రమ్య. బాలీవుడ్‌ మీడియా అక్కడి స్టార్లతో నటించిన చిత్రాలపై ప్రశ్నించగా షారుక్‌ ఖాన్‌ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా అయ్యాయి. 1996లో చాహత్‌ లో షారుక్‌ తో నటించిన సినిమా గురించి చెపుతూ గతస్మృతులు గుర్తుచేసుకుంది. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సంస్కారం తెలిసిన వ్యక్తి అని రమ్య కృష్ణ కొనియాడింది. చుట్టూ ఉన్నవారిని తన ప్రవర్తనతో ఆకట్టుకుంటాడని, అతనొక స్వీట్ హార్ట్ అని చెప్పింది. లైగర్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడింది. 1996లో షారుక్ హీరోగా వచ్చిన ‘చాహత్’లో తాను విలన్ గా చేసినట్లు గుర్తుచేసుకుంది. అప్పుడు చాలా సహాయం చేశాడని తెలిపింది. అతను రణ్ వీర్ సింగ్ గా ఫుల్ ఎనర్జీతో ఉంటాడని పేర్కొంది.

విజయ్‌ దేవరకొండ తల్లిగా నటించిన లైగర్‌లో నటించిన వినూత్నమైన పాత్రల్లో ఇదొకటి అని ప్రస్తావించారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్‌ 169వ చిత్రమైన ‘జైలర్‌’లో ప్రత్యేకపాత్రను పోషిస్తున్నట్లు.. ప్రస్తుతం బీటౌన్‌లో బాయ్‌కాట్‌ పదం వినిపిస్తుండగా, లైగర్‌ టీం స్వేచ్ఛగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం పట్ల హిందీ సినీ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చిత్రం లైగర్‌కు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహింగా.. కరణ్‌ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈలైగర్‌ సినిమా ఆగస్టు25న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here