హిట్ 2లో లిప్ లాక్ తో రెచ్చిపోయిన అడవి శేష్

0
35

అడివి శేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా సైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఉరికే ఉరికే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ పాడితే చాలు ఆ సాంగ్ సూపర్ హిట్టయిపోతుంది. రొమాంటిక్ మెలోడీ సాంగ్స్‌ అన్నీ సిద్ శ్రీరామ్‌ను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయనకే మరో అద్భుత సాంగ్ దొరికింది. ఆ పాట వింటుంటేనే మంచి మెలోడీ ఫీల్ కలిగించింది. హీరో, హీరోయిన్లుగా నటించిన అడివి శేష్, మీనాక్షి చౌదరీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప్రోమోనే ఇలా ఉంటే.. కచ్చితంగా ఫుల్ సాంగ్ వేరే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సిద్ శ్రీరామ్‌తో పాటు రమ్యా బెహ్రా పాడారు. ఈ పాటకు ఎంఎం శ్రీ లేఖ సంగీతాన్ని అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాట ఫుల్ సాంగ్ ఈ నెల 10న అంటే గురువారం విడుదల కాబోతుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ కేడీ అనే పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here