తెలుగు చిత్ర పరిశ్రమ దశాబ్ద కాలం లో సాధించిన పురోగాభివృధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న మార్పులకి రాజమౌళి కీలక పాత్ర పోషించి రాజమౌళి యుగం అనేలా తెలుగు సినిమాని ప్రంపంచదేశాలకి పరిచయం చేశారు..బాహుబలి మూవీ తో అద్భుతాలు సృష్టించిన రాజమౌళి ఆ తరువాత RRR సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసి ఇండియా లో హిందీ ఒక్కటే భాష కాదు తెలుగు కూడా ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి..
రాజమౌళి మార్గదర్శిగా మారి వేసిన బాటలోనే ఇప్పుడు అంత నడుస్తున్నారు.. అదే బాటలో నడిచిన పుష్ప సినిమాకి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.. దీనితో కోలీవుడ్ కుళ్లుతో రగిలిపోతుంది.. అన్ని అవార్డులు తెలుగు సినిమాలకే ఇచ్చారు కోలీవుడ్ కి ఎం ఇవ్వలేదు అంటూ అక్కసుని వెళ్లగక్కుతున్నారు కొందరు కోలీవుడ్ మేధావులు..
అయితే ఒకప్పుడు కోలీవుడ్ ఇప్పుడు తెలుగు సినిమా ఉన్న స్టానంలో ఉండేది.. మణిరత్నం, శంకర్, వెట్రి మారన్ లాంటి గొప్ప దర్శకులు కోలీవుడ్ ని విజయపధంలో నిలిపారు.. అయితే ఈ మధ్య కాలంలో శంకర్ గ్రాఫ్ కాస్త డౌన్ అవ్వడం, మణిరత్నం మునిపటిలా సినిమాలు చేయలేకపోవడం,వెంట్రి మారన్ గ్యాప్ తీసుకోవడం తో కోలీవుడ్ లో సరైన సినిమాలు రావట్లేదు..దీనికి తోడు యుంగ్ దర్శకులు కంటెంట్ ని పక్కకి పెట్టి కమెర్షియల్ చిత్రాలపైనద్రుష్టి పెట్టడం కూడా కోలి వుడ్ పతనానికి కారణం అయ్యింది..
కమెర్షియల్ చిత్రాలలో మెస్సేజ్ ని చూపించడంలో కోలీవుడ్ కి సాటిలేదు ఒకప్పుడు ..ఇప్పుడు ఇది కరువైపోయింది..తీస్తే కమర్షియల్ లేకుంటే కంటెంట్.. కానీ ఆ రెంటిని కలిపి మాత్రం చూపలేకున్నారు ప్రస్తుతం ఉన్న కోలీవుడ్ యంగ్ డైరెక్టర్స్..ఇది తెలుసుకోకుండా కోలీవుడ్ కి అన్యాయం చేసారంటూ టాలీవుడ్ హీరోలపైన మరియు చిత్రాల పైన అక్కసుని వెళ్ళబుచ్చడం నిజంగా బాధాకరం..