Lawrence Bishnoi: అప్పటివరకూ సల్మాన్‌ను క్షమించేదే లేదు

0
182

ఇప్పటికే పలు కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న లారెన్స్ బిష్ణోయ్‌ను సల్మాన్ ఖాన్‌కి వచ్చిన బెదిరింపు లేఖ కేసులో పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే! బిష్ణోయ్ వర్గానికి సంబంధించిన వారి నుంచే ఆ లేఖ వచ్చిందని తేలడంతో, అతడ్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగానే అతడు సల్మాన్‌ని క్షమించేదే లేదంటూ బాంబ్ పేల్చాడట! ‘‘కృష్ణజింకల హత్య కేసులో సల్మాన్ ఖాన్‌ని మా వర్గం ఎప్పటికీ క్షమించదు. ఈ కేసు విషయంలో అతడు బహిరంగ క్షమాపణ చెప్తేనే క్షమిస్తాం’’ అని లారెన్స్ తమ విచారణలో చెప్పినట్టు ఢిల్లీ పోలీసులు వివరించారు.

కాగా.. జోధ్‌పూర్ అడవిలో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ను దోషిగా తేల్చుతూ కోర్టునిచ్చిన సంగతి విదితమే! ఈ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన సల్మాన్ మీద.. బిష్ణోయ్ వర్గీయులు 2018లోనే హత్యాయత్నం చేశారు. ఇప్పుడు సల్మాన్‌తో పాటు అతని తండ్రి సమీర్ ఖాన్‌ను టార్గెట్ చేశారు. పంజాబి సింగర్ సిద్ధూ మూసేవాలాకు ఎలాంటి గతి పట్టిందో.. అలాగే ఆ ఇద్దరికీ పడుతుందని సల్మాన్‌కి వచ్చిన బెదిరింపు లేఖలో ఆ వర్గీయులు పేర్కొన్నారు. కృష్ణజింకల్ని బిష్ణోయ్ వర్గీయులు దైవంగా భావిస్తారు. అందుకే, సల్మాన్‌ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here