మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఓరేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు దీటుగా ముందుకు సాగుతున్నారు. కాగా.. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ బీజీ షెడ్యూల్ వున్నారు చిరు. అయితే ఇటీవలే చిరు ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. కాగా ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. కాగా చిరుచేతులో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య ఒకటి. ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ చాలా రోజులగా అన్వేషిస్తున్నారని టాక్. అయితే ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి, సముద్రఖని విలన్‌గా నటిస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఇప్పుడు మరో పేరు తెరపైకి రావడంతో సంచలనంగా మారింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మేకర్స్ బీజూమీనన్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందని సమాచారం. దీనిపై స్పష్టత త్వరలోనే రానుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో బిజు మీనన్ పేరు దక్షిణాదిన మారు మోగిపోయిన విషయం తెలిసిందే. అయితే.. బిజూ మీనన్ ‘రణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా చిరంజీవి ఈ చిత్రంలో అండర్‌కవర్ కాప్‌గా కనిపించనుండగా.. శాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్‌మహారాజ రవితేజ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.