Pooja Hegde: నిర్మాణ సంస్థ షాక్ .. నీ బిల్లు నువ్వే కట్టుకో..

0
124

అలా వైకుంఠపురంలో అంటూ మనకు టక్కున గుర్తుకు వచ్చేది బుట్టబొమ్మ పూజా హెగ్దే. తమ అందాలతో అందరిని ఆకట్టుకోంది. ఈ సినిమాతో ఓక్రేజ్ సంపాదించుకున్న పూజాకు వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ. చాలా వరకు ప్లాప్ కూడా అయ్యాయి. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినాకూడా బుట్టబొమ్మకు అటు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుస సినిమాలు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమా కోసం పూజా హెగ్డే చేసిన ఖర్చులు భరించలేక నిర్మాతలు ఆమెకి బిల్లు పంపి కట్టమని చెప్పినట్టు సమాచారం.అసలు విషయానికి వస్తే పూజా ఒక్కో సినిమాకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొనే సమయంలో ఈమెతో పాటు ఈమె స్టాఫ్ కి సంభందించిన ఖర్చులు కూడా నిర్మాణ సంస్థ వారు భరించాల్సిందే.

ఇటీవల తమిళ హీరో విజయ్ తో కలసి బీస్ట్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో నిర్మాతలు కూడా కొంతవరకు నష్టపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజాహెగ్డే తన స్టాఫ్ తో కలిసి కేవలం తిండి కోసం మాత్రమే లక్షలు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా వల్ల నష్టాల పాలైన నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చులను భరించలేక పోయారు.అందువల్ల ఆమె తన స్టాఫ్ తో కలిసి చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఆమెకి పంపి వాటిని కట్టమని చెప్పారట.ఈ విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది.

Crime News: ఘోరం.. బైక్ ను ఢీకొట్టిన వాహ‌నం.. ముగ్గురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here