ఏక్తా కపూర్ కొంపముంచిన బూతు సిరీస్.. అరెస్ట్ వారెంట్ జారీ

0
96

బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో ఏక్తా కపూర్ ఒకరు. ఈమె సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలను నిర్మిస్తుంది. ఈమధ్య ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ఈమె వరుసగా బూతు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. ఓటీటీలో అడల్ట్ కంటెంట్‌కి సెన్సార్ ఉండకపోవడం, యువత కూడా వాటికి బాగా ఆకర్షితులు అవుతుండడంతో.. అడల్ట్ కంటెంట్‌తో రకరకాల వెబ్ సిరీస్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె XXX అనే వెబ్ సిరీస్ నిర్మించింది. మొదటి సీజన్‌కి యూత్ నుంచి మంచి ఆదరణ రావడంతో, రెండో సీజన్‌ని ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తీసింది. అదే ఆమె కొంపముంచింది. అందులో సైనిక కుటుంబాల మనోభావాలు దెబ్బతీసేలా చూపించారని విమర్శలు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్‌లకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

2020లో బీహార్‌లోని బేగుసరైకు చెందిన శంభు కుమార్ అనే మాజీ సైనికుడు.. సైనికుల్ని అవమానపరిచేలా, వారి కుటుంబ విలువలు దెబ్బతీసేలా XXX రెండో సీజన్‌లో సీన్లను చిత్రీకరించారంటూ ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ కేసులో ఏక్తా, శోభలపై ధర్మాసనం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై అడ్వొకేట్ హృరికేశ్ పాఠక్ మాట్లాడుతూ.. ‘‘కోర్టు ఇదివరకే వాళ్లను హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కానీ వాళ్లు కోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. కోర్టులో హాజరు కాలేదు. అందుకే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. సీరియల్స్ నిర్మించి ఎంతో పేరు గడించిన ఏక్తా కపూర్ ఇప్పుడు విమర్శలపాలవుతోంది. జీవితాంతం అనుభవించేంత డబ్బున్నప్పటికీ.. ఇంకా డబ్బులు సంపాదించుకోవడం కోసం అడల్ట్ కంటెంట్‌ని అడ్డం పెట్టుకోవడం దురదృష్టకరమని నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు.

కాగా.. ఏక్తా, శోభ కపూర్‌లపై ఇతర ప్రాంతాల్లో కూడా XXX రెండో సీజన్ విషయమై కేసులు నమోదయ్యాయి. నీరజ్ యగ్నిక్ చేసిన ఫిర్యాదు మేరకు.. 2020లో అన్నపూర్ణ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఇండియన్ పీనల్ కోడ్ & ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే.. బీహార్‌లోని ముజప్ఫర్పు్ర్ కోర్టులో కూడా వారిద్దరిపై ఫిర్యాదు అందింది. ఇంత జరుగుతున్నా.. ఏక్తా కపూర్, శోభ కపూర్‌లు మాత్రం తమకేమీ ఎరుగనట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here