టాలీవుడ్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్, అను మెహతా హీరోహీరోయిన్లుగా పీఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాబరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పి.నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. నిర్మాతగా ప్రవీణ శివరాజ్, దర్శకత్వం పి. మణిరాజ్ వహిస్తున్నారు. పరశురామ్ ఎరుగదిండి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సి. అక్షయరాజ్ ఎడిటింగ్, శ్రీను-సిద్ధు పీఆర్వోగా ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపామని చిత్ర దర్శకుడు పి. మణిరాజ్ వెల్లడించారు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని.. హీరో పృథ్వీరాజ్, హీరోయిన్ అనూ మెహతా చక్కగా నటించారని తెలిపారు. టెక్నీషియన్స్ అందరూ పూర్తి సహకారం అందించారని చెప్పారు. షూటింగ్ పూర్తయ్యిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయని వెల్లడించారు. ఒక రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా అని.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. త్వరలోనే టైటిల్, ఫస్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.