కృష్ణ మృతిపై ఆర్జీవీ వీడియో పోస్ట్ వైరల్

0
57

గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణుల్ని రంగంలోకి దిగి.. ప్రపంచస్థాయి చికిత్సని అందించారు. కానీ.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, వెంటిలేటర్‌పై కన్నుమూశారు. కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ ఇక లేడన్న విషయం తెలిసి అభిమానులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటని, యావ‌త్ సినీ ప్రపంచం కృష్ణ మ‌ర‌ణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే అంద‌రితో పోల్చితే తాను పూర్తి డిఫ‌రెంట్ అని భావించే ద‌ర్శకుడు ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించారు.

బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కృష్ణ గారు మరియు విజయనిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ఆర్జీవీ ట్విట్‌ చేశారు. ఆట్వీట్‌ కు మోసగాళ్లకు మోసగాళ్లలోని కృష్ణ , విజయనిర్మల పాట వీడియోను జతచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆట్విట్‌ కాస్త తెగ వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here