Faria Abdullah: ‘చిట్టి’ భామకు బంపరాఫర్..?

0
146

ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘జాతి రత్నాలు’తోనే అందరి దృష్టిని ఆకర్సించిన ఫరియా అబ్దుల్లా.. అప్పట్నుంచే క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు ఈ భామకి తాజాగా ఓ బంపరాఫర్ వచ్చిందని సమాచారం. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించనుందట! అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎవరు కరెక్ట్‌గా సెట్ అవుతారా? అని కొందరిని జల్లెడ పట్టిన మేకర్స్.. చివరికి ఫరియా అబ్దుల్లాని ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా.. ఇదివరకే ఫరియా ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలతో కలిసి ఆడిపాడింది. ఆ పాటలో ఈమె వేసిన స్టెప్పులకి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే ఏజెంట్‌లో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుండగా.. రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న రావణాసురుడు సినిమాలోనూ ఫరియా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈమె రోల్ నెగెటివ్ షేడ్స్‌లో ఉండనుందట! ఈ లెక్కన కచ్ఛితంగా సినిమాలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సో, తన ప్రతిభ చాటేందుకు ఓ గోల్డెన్ ఛాన్స్ దొరికిందన్నమాట! మరి, నెగెటివ్ షేడ్స్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here