Manchu Vishnu: షూటింగ్ లో గాయాలపాలైన మంచు విష్ణు

0
128

Manchu Vishnu: హీరో మంచు విష్ణు గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం విష్ణు జిన్నా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసం సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మా ప్రెసిడెంట్ గారు బాగా కష్టపడుతున్నారట. పాటలు, ఫైట్లు, డ్యాన్సులు అన్ని కష్టతరమైన ఇష్టంగా చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ప్రస్తుతం సాంగ్స్ షూటింగ్ జరుగుతుండగా అందులో పాల్గొన్నాడట విష్ణు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో విష్ణు రిస్కీ స్టెప్స్ నేర్చుకుంటున్నాడు. ఆ స్టెప్స్ నేర్చుకొని నేర్చుకొని కాలుకు దెబ్బ కూడా తగిలిందని విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ వలన ఈ దెబ్బ తగిలింది.. అయినా ఆయన డ్యాన్స్ ను నేను ఎంజాయ్ చేస్తున్నా అని విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విష్ణు విజయాన్ని అందుకుంటాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here