పెళ్లిపీటలు ఎక్కనున్న హీరో రామ్.. ముహూర్తం ఫిక్స్

0
738

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తన స్కూల్‌మేట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. రామ్ ఎంగేజ్‌మెంట్ ఆగస్టు(శ్రావణమాసం)లో జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లి నవంబర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరి పేర్లపై ముహూర్తం కూడా పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో హీరో రామ్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ నటించిన ‘ది వారియర్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాను తెరకెక్కించాడు.

కాగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ సినిమాతో రామ్ టాలీవుడ్‌లో తెరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే డాన్సులు, ఫైట్స్‌, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవదాసు మూవీ తర్వాత జగడం, రెడీ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలలో రామ్ నటించాడు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ రామ్‌కు మాస్ హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టింది. రెడ్ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం కూడా చేశాడు. అటు రామ్‌ హీరోగా ఇటీవల 16 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here