మలయాళ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సౌందర్య తర్వాత అంత పద్ధతిగా నటించే హీరోయిన్‌గా నిత్యమీనన్ పేరుతెచ్చుకుంది. అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యి్ందే, ఓకే బంగారం, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాల ద్వారా నిత్యమీనన్ పేరు తెచ్చుకుంది. పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోయిన్ నిత్యామీనన్ త్వరలో మలయాళ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరనేది సస్పెన్స్‌లో ఉంది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట తమ తల్లిదండ్రులను కూడా ఒప్పించినట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
మలయాళంలో స్టార్ నటుడుగా కొనసాగుతున్న వ్యక్తిని నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు నుంచే అతనితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలారని.. ఇప్పుడు అతన్నే నిత్యా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు నిత్యమీనన్ సొంతంగా యూట్యూబ్ చానల్ కూడా పెట్టుకుంది. నిత్య అన్‌ఫిల్టర్డ్ పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసి తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను వీడియోల రూపంలో తెలియజేస్తోంది. కాగా రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇందులో ఫుడ్ లవర్‌గా నిత్య కనిపించింది.