Kalyan Ram Reveals Reason Behind NTR30 Delay: ‘NTR30’ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోంది. కానీ, ఇంతవరకూ పట్టలెక్కలేదు. అదిగో, ఇదిగో అంటూ నాన్చుతున్నారే తప్ప.. సెట్స్ మీదకి తీసుకెళ్లడం లేదు. స్క్రిప్ట్ పనులు ఇంకా ఫైనల్ కాకపోవడమే ఇందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని తాజాగా కళ్యాణ్ రామ్ ధృవీకరించాడు. బింబిసార ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న ఆయన.. ఈ సందర్భంగా NTR30కి గల కారణాలేంటో వెల్లడించాడు.
‘‘NTR30 సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ.. ఆర్ఆర్ఆర్ వచ్చిన తర్వాత ఆ ప్లాన్స్ అన్నీ బెడిసికొట్టాయి. ఆ సినిమా అనంతరం తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో, తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్‌లోనే తీయాలని తారక్ డిసైడ్ అయ్యాడు. దీంతో.. అన్నీ చక్కగా కుదిరేలా కొరటాల శివ కసరత్తు చేస్తున్నాడు’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. చూస్తుంటే.. కొరటాల శివ మొత్తం స్క్రిప్టే మార్చేసినట్టు కనిపిస్తోంది. హిందీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకోవాలి కాబట్టి, వాళ్ల అభిరుచికి తగ్గట్టు మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది.
దానికితోడు.. రాజమౌళి స్టాండర్డ్స్‌ని అందుకోవడం అన్నది అంత మామూలు విషయం కాదు. రాజమౌళితో సినిమా చేశాక ప్రతి ఒక్కరూ వైఫల్యాల్ని చవిచూశారు. అలాంటి రిజల్ట్ రిపీట్ కాకుండా ఉండేందుకు.. తారక్ సైతం ఈ ప్రాజెక్ట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పైగా.. జనతా గ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల కాంబోలో వస్తోన్న మూవీ కాబట్టి, అంచనాలు తారాస్థాయిలో తప్పకుండా ఉంటాయి. ఈ లెక్కలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే, ఆలస్యంగా అయినా కథ పర్ఫెక్ట్‌గా వచ్చేందుకు కష్టపడుతున్నారు.