‘దేవీపుత్రుడు’ మూవీని తలపిస్తున్న కార్తీకేయ-2 ట్రైలర్

0
118

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘కార్తీకేయ-2’. గతంలో వచ్చిన కార్తీకేయ మూవీకి ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తొలి ట్రైలర్‌ను చిత్రయూనిట్ హైదరాబాద్ నగరంలోని ఏఎంబీ థియేటర్‌లో విడుదల చేసింది. ఈ సినిమాను కూడా తొలిభాగానికి దర్శకత్వం వహించిన చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ మూవీ ట్రైలర్ చూస్తే మనకు దేవీపుత్రుడు సినిమా గుర్తుకురావడం ఖాయం

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దేవీపుత్రుడు సినిమాలో కృష్ణుడు, సముద్రం, అయోధ్య అనే అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడు కార్తీకేయ-2 సినిమాలో కూడా కృష్ణుడు చుట్టూ అల్లుకున్న అంశం కనిపిస్తోంది. కృష్ణుడి విగ్రహం, దాని వెనుక ఉన్న శక్తి, ఆ శక్తి కోసం పరితపించే విలన్స్… ఇలా దేవీపుత్రుడు, కార్తీకేయ-2 సినిమాకు పోలికలు కనిపిస్తున్నాయి. మరి కథనం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 22న విడుదల కానుంది. అదే రోజు నాగచైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీ ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here