శంకర్, రజినీకాంత్, అక్షయ్ కుమార్ కాంబోలో వచ్చిన ‘2.0’ సినిమా ఇప్పటివరకూ దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా చెలమణి అవుతోంది. ఇప్పుడు అంతకుమించి బడ్జెట్‌తో మహేశ్ బాబు సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఫిగర్ ఎంతన్నది ఇంకా తెరమీదకి రాలేదు కానీ, ఖర్చు మాత్రం 2.0 చిత్రానికి మించి ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్నకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ముఖ్యంగా.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యాక విదేశీయులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో.. మహేశ్‌తో చేయనున్న చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే, బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని జక్కన్న డిసైడ్ అయినట్టు వార్తలొస్తు్న్నాయి. బహుశా ఈ సినిమా బడ్జెట్ పిగర్ రూ. 600 – 650 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే.. దేశంలో ఇదే కాస్ట్లీయెస్ట్ సినిమాగా అవతరించనుంది.
కాగా.. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా పనులు ముగిశాక.. జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందుకోసం మహేశ్ రెండేళ్లపాటు డేట్స్ జక్కన్నకి ఇచ్చేశాడని సమాచారం. ఆఫ్రికన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనుంది.